Dry Cough: వర్షాకాలం తరువాత వ్యాధులు విజృంభిస్తాయి.ఈ పరిస్థితి వింటర్ లోనూ కొనసాగుతుంది. వాతావరణం చల్లగా ఉండడంతో ముందుగా ఫీవర్ వచ్చి ఆ తరువాత దగ్గు, జలుబు చేస్తాయి. అయితే ఇటీవల చాలా మంది జ్వరం వచ్చి ప్లేట్ లెట్స్ తగ్గే వరకు వెళ్తున్నాయి. ఆ తరువాత చికిత్స తీసుకొని నయం చేసుకున్నా.. పొడి తగ్గు వదలడం లేదు. జ్వరం లేకున్నా దగ్గు కొనసాగుతోంది. దీని కోసం ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గడం లేదు. అయితే పొడి దగ్గును నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొడిదగ్గు రావడానికి వాతావరణంలో ఉన్న మార్పలే కాకుండా శరీరంలో జరిగే ఆరోగ్య ప్రక్రియలకు కారణమవుతాయి. అయితే పొడిదగ్గు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే వివరాల్లోకి వెళితే..
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది కాఫ్ తో బాధపడుతున్నారు. ముఖ్యంగా పొడి దగ్గు తో కొందరికి చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది. అయితే దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయద్దంటున్నారు. కొందరి శరీరాల్లోని రసాయన క్రియల వల్వ మెడిసిన్ వాడినా పొడి దగ్గు నయం కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించడం వల్ల నివారణ అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే ఇలా ప్రయత్నించొచ్చు.
నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు కచ్చితంగా ఉంటుంది. తులసి చెట్టు కేవలం పూజ చేయడానికి మాత్రమే కాకుండా ఆయుర్వే మొక్కగా ఉపయోగపడుతుంది. పొడిదగ్గుతో బాధపడేవారు కొన్ని తులసి ఆకులను వేడినీటిలో బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ కషాయాన్ని చల్లార్చి తాగాలి. నీరు గోరువెచ్చగా ఉండగానే ఈ కషాయాన్ని తీసుకోవడం ద్వారా త్వరగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పరగడుపు తీసుకోవడం మరీ మంచిది.
పొడిదగ్గు నివారణకు మరో చిట్కా తేనె నీరు. పొడిదగ్గు అదేపనిగా వస్తుంటే గోరువెచ్చని వేడి నీళ్లో చిటికెడు తేనె వేయాలి. ఆ మిశ్రమాన్ని తాగాలి. లేదా ఇందులో దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవడం ద్వారా మరింత తొందరగా దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది. దగ్గు వేధించేవారికి మిరియాల కషాయం మంచి ఔషధంలా పనిచేస్తుంది. మిరియాల పొడిన ఆవునెయ్యిలో కలుపుకొని తాగాలి. పిల్లలు దగ్గుతో బాధపడుతుంటే దానిమ్మరసంలో అల్లంపొడిని కలిపి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.