Gold vs Silver: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో బంగారం దొరుకుతుందో లేదో నన్ను భయంతో చాలామంది ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు మిగతా వాటికంటే బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎక్కువగా లాభం వస్తుందని అనుకుంటున్నారు. అయితే అంతర్జాతీయంగా బంగారం లోహానికి డిమాండ్ పెరగడంతో ఇండియాలో మాత్రం వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయాలంటే రూ.1,30,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇదే మొత్తంతో కిలో వెండి కొనుగోలు చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. అంతేకాకుండా మన దేశంలో బంగారంతో పాటు వెండి ఆభరణాలు కూడా ధరిస్తూ ఉంటారు. దీంతో ప్రస్తుతం రెండే బంగారం గా మారిపోతుంది. మరి వారం రోజులుగా వెండి ఎంతవరకు పెరిగింది? బంగారం కంటే వెండి ఎందుకు కొనుగోలు చేస్తున్నారు?
అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులతో పాటు.. డాలర్ విలువ పడిపోవడంతో చాలామంది బంగారం పై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇండియాలో బంగారం పై మక్కువ ఉన్నవారు లిక్విడ్ గోల్డ్ తో పాటు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ఆన్లైన్ లో పెట్టుబడులు పెడుతున్నారు. భారతదేశంలో బంగారం ఇన్వెస్ట్మెంట్ కోసం కాకుండా ఆభరణాల కోసం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ధరలు పెరగడంతో భవిష్యత్తులో కొనలేము అన్న ఉద్దేశంతో ఇప్పుడే చాలామంది కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. అయితే బంగారం తో పాటు వెండి ధర కూడా పెరుగుతుంది. కానీ బంగారం కంటే ఎక్కువగా వెండి ధరలు పెరిగాయని తెలుస్తోంది.
అక్టోబర్ 7న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,400 గా నమోదయింది. అక్టోబర్ 14న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350 ధర పలికింది..వెండి ధరలు చూస్తే అక్టోబర్ 8న కిలో వెండి రూ.1,70,000 ఉండగా.. అక్టోబర్ 14న రూ.2,06,00 ధర పలికింది.
వారం రోజుల్లో బంగారం ధర 10 గ్రాములకు.1,950 నుంచి రూ.2,613 వరకు పెరిగింది. అంటే 1.8 శాతం నుంచి 2.15 శాతం వరకు పెరిగింది. అదే వెండి కిలోకు రూ.7,200 నుంచి రూ.9,257 వరకు పెరిగింది. అంటే సుమారు నాలుగు శాతం నుంచి 6% వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే బంగారం కంటే వెండి ధర ఎక్కువగా పెరిగినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది ప్రస్తుతం బంగారం కంటే వెండి కొనుగోలు చేయడం ఉత్తమమని అంటున్నారు. అంతేకాకుండా 10 గ్రాముల బంగారం కొనుగోలు చేసే ధరలో కిలో వెండి కొనుగోలు చేయవచ్చని ఆలోచిస్తున్నారు. వీటితో ఆభరణాలు చేయించుకోవడమే కాకుండా కొన్ని వస్తువులను కూడా తయారు చేయవచ్చు. భవిష్యత్తులో కూడా వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.