Sleep Health Tips: మనిషి ఆరోగ్యానికి సరైన నిద్ర చాలా అవసరం. కానీ నేటి కాలంలో కొన్ని పనుల కారణంగా చాలామంది అనుకున్నంత నిద్రపోవడం లేదు. ఉద్యోగ, వ్యాపార రీత్యా కొందరు నిద్రకు దూరమైతే.. మరికొందరు కాలక్షేపం చేయడానికి నిద్రను చెడగొట్టుకుంటున్నారు. వాస్తవానికి సరైన ఆహారంతో పాటు మంచి నిద్ర ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలా నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మంచి నిద్ర వల్ల కంటికి సరైన ఆరోగ్యం ఉంటుంది. కానీ కలత నిద్ర వల్ల కళ్ళు మండినట్లు కనిపిస్తాయి. ఇలా అనిపించడమే కాకుండా భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వస్తాయి. వాటిలో ఇదొకటి. ,
ఎంత ఒత్తిడి కలిగినా.. ఒక క్షణం కళ్ళు మూసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. అంటే కాసేపు మంచి నిద్రపోతే ఎలా ఉంటుంది? అదే గాఢ నిద్రపోతే ఎలా ఉంటుంది? అంటే గాఢ నిద్ర పోవడం వల్ల కళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు అవుతుంది. గాడ నిద్రలో కళ్ళలో నీళ్లు ఉత్పత్తి అవుతాయి. ఇలా ఉత్పత్తి అయిన నీళ్లు కళ్ళలో ఉండే పొరలను మృదువుగా తయారుచేస్తాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల కన్నీళ్లు ఉత్పత్తి కాకుండా ఉంటాయి. కన్నీళ్లు ఉత్పత్తి కాకపోతే కళ్ళు పొడిబారినట్లు అవుతాయి. ఇలా దీర్ఘకాలికంగా ఉండడం వల్ల కళ్ళ చూపుకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఫలితంగా ఒక్కోసారి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వివిధ పనుల కారణంగా నిద్ర ఆలస్యమైతే.. ఆ తర్వాత రోజు నిద్ర గడియారాన్ని పూర్తిచేయాలి. కానీ కొందరు కాలక్షేపం కోసం రాత్రులు ఆలస్యంగా నిద్రపోతున్నారు. ముఖ్యంగా ఫోన్ వాడుతూ నిద్ర చెడగొట్టుకోవడం వల్ల కళ్ళపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం తాత్కాలికంగా చూపించకపోయినా.. దీర్ఘకాలికంగా మాత్రం అనేక సమస్యలను తీసుకువస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు రాత్రి తొందరగా నిద్రించే ఏర్పాటు చేయాలి. అయితే నిద్ర కడియారని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోయి.. ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తామంటే కుదరదు. సరైన సమయంలో నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వాతావరణంలో ఉండే మార్పుల కారణంగా ఉదయం పూట ఎక్కువగా గాఢ నిద్రపట్టే అవకాశం ఉండదు. రాత్రులు మాత్రమే గాఢ నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. గాడ నిద్రపోయినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
అయితే కొందరు తమ పనుల కారణంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇలాంటి వారు త్వరగా నిద్ర పోవాలంటే ధ్యానం చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి. లేదా రాత్రి పడుకునే 30 నిమిషాల ముందు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల జోలికి పోకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. స్నేహితులతో గడపాలి. పిల్లలతో ఆటలు ఆడాలి. ఆ తర్వాత నిద్రపోవడం వల్ల గాఢ నిద్ర వస్తుంది. అంతేకాకుండా సాయంత్రం వాకింగ్ లేదా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరం అలసిపోయి గాడ నిద్రకు వెళ్లే అవకాశం ఉంటుంది.