Daily Bath Benefits: కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. దీంతో కొన్ని పనులు సులువుగా చేయగలుగుతున్నాం. అయితే ఇదే సమయంలో మనిషికి శారీరక శ్రమ తగ్గుతోంది. ఫలితంగా బద్ధకం పెరుగుతుంది. ఈ బద్ధకం ఎలా తయారయ్యిందంటే.. ఆహారం తినడం కూడా కష్టమే అనిపిస్తోంది. మానవ శరీర ఆరోగ్యానికి ప్రతిరోజు పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా మన భారతదేశంలో పరిశుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పరిశుభ్రతలో భాగంగా ఉదయం లేవగానే దంతాలను శుభ్రం చేసుకోవడం.. ఆ తర్వాత స్నానం చేయడం ఉన్నాయి. అయితే ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు తెలుపుతున్న ప్రకారం ప్రతిరోజు స్నానం చేయడం వల్ల నష్టాలు ఉన్నాయని అంటున్నారు. ఇది కాస్త షాకింగ్ న్యూస్ అనిపించినా.. వారు దానికి కారణాలు కూడా చెప్పారు. మరి అదేంటో చూద్దాం..
పరిశుభ్రతలో భాగంగా ప్రతిరోజు తప్పనిసరిగా స్నానం చేయాలి. శరీరానికి ప్రతిరోజు చెమట వస్తుంది. ఈ చెమట దుర్గం దానికి దారి తీస్తుంది. అంతేకాకుండా శరీరంపై చెమట ద్వారా బ్యాక్టీరియా పెరిగి అనేక అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు స్నానం చేయకపోవడం వల్ల శరీరంపై మట్టి పేరుకు పోతుంది. ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్ రావడానికి కారణం అవుతాయి. ఆ తర్వాత అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వేడి ఉన్న ప్రాంతాల్లో స్నానం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే మన భారతదేశంలో ఉదయం స్కూలుకు వెళ్లే విద్యార్థుల నుంచి వ్యాపారానికి వెళ్లే వారు స్నానం చేస్తారు.
కానీ ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు తెలుపుతున్న ప్రకారం ప్రతిరోజు స్నానం చేయడం వల్ల నష్టాలు ఉన్నాయని అంటున్నారు. శరీరంపై seban అనే పొర ఉంటుంది. ఈ పొర శరీరాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే స్నానం చేయడం వల్ల ఈ పోరా తొలగిపోతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. చర్మంపై ఉండే సహజ నూనెలతో కొన్ని బ్యాక్టీరియాలు కలిసి పనిచేస్తాయి. ఈ బ్యాక్టీరియాలో శరీరానికి హాని చేయకుండా కాపాడతాయి. విష పదార్థాలు శరీరంలోకి వెళ్లకుండా బ్యాక్టీరియా అడ్డుకుంటుంది. అయితే తరచూ స్నానం చేయడం వల్ల శరీరంపై ఉండే ఈ బ్యాక్టీరియా తొలిగిపోతుంది. దీంతో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే అలర్జీ, తామర వంటి వ్యాధులు కూడా వస్తాయి. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల తలలో ఉండే జుట్టు పొడిబారుతుంది.
అయితే ప్రతిరోజు స్నానం చేయడం వల్ల నష్టాలు ఉన్నా.. తప్పనిసరిగా పరిశుభ్రత కోసం స్నానం చేయాల్సిన అవసరం ఉంది. కానీ స్నానం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా వేడినీళ్లతో స్నానం చేయొద్దు. ఇలా చేయడం వల్ల శరీరంపై ఉండే రక్షణ బ్యాక్టీరియా తొలిగిపోతుంది. అలాగే ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల జుట్టు పాడైపోతుంది. అంతేకాకుండా మెదడు పనితీరు మారిపోతుంది. స్నానం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోకూడదు. కేవలం 3 నుంచి 5 నిమిషాల్లోనే పూర్తి చేయాలి.