https://oktelugu.com/

Domestic Markets : ఆదుకున్న ఐటీ షేర్లు.. లాభాల్లోకి దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు..

రెండు రోజుల వరుస నష్టాల నుంచి బుధవారం (ఆగస్ట్ 14) దేశీయ మార్కెట్లు బయటపడ్డాయి. ప్రస్తుతం ఐటీ షేర్లు పెరగడంతో ఈ నష్టాల నుంచి కొంత కోలుకుంటున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 15, 2024 / 04:28 PM IST

    Domestic Markets

    Follow us on

    Domestic Markets : దేశీయ మార్కెట్లో ఐటీ షేర్లు పరుగులు పెట్టాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుందనే అంచానాలు , మార్కెట్ ను కోలుకునేలా చేశాయి. అంతర్జాతీయంగా కూడా సానుకుల పవనాలు రావడంతో మార్కెట్లు కోలుకున్నాయి. మరోవైపు దేశీయంగా చూసుకుంటే ద్రవ్యోల్పణం తగ్గడం కూడా బాగా కలిసి వచ్చింది. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 3 పైసలు పెరిగి 83.94 వద్ద క్లోజ్ అయ్యింది. ఇక బ్యారెట్ ముడిచమురు 0.59 శాతం లాభంతో 81.17 డాలర్ల వద్ద నమోదవుతున్నది. ఇక ఆసియా మార్కెట్లలో టోక్యోతో పాటు సియోల్ కూడా లాభపడింది. దీంతో పాటు ఐరోపా సూచీలు లాభాలను నమోదు చేశాయి. మరోవైపు హాంకాంగ్, షాంఘై తీవ్ర నష్టాన్ని చవి చూశాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 109 పాయింట్లలాభంతో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే నడిచింది. గరిష్ఠంగా 79.228.94 వద్ద ట్రేడైంది. చివరకు 149.85 పాయింట్లు లాభపడింది. అంటే 79,105.88 వద్ద క్లోజ్ అయ్యింది. నిఫ్టీ కూడా 4.75 పాయింట్లు పెరిగింది. 24,143.75 వద్ద స్థిరపడింది. మొత్తంగా చూసుకుంటే సెన్సెక్స్ 30 షేర్లలో మొత్తంగా 15 వరకు లాభాలు చూశాయి. ఇందులో కంపెనీల వారీగా చూసుకుంటే టీసీఎస్ 2.30శాతం, టెక్ మహీంద్రా 1.41 శాతం, టాటా స్టీల్ 1.81 , హెచ్సీఎల్ టెక్ 2.09 , భారతీ యిర్ టెల్ 0.83 లాభపడ్డాయి. , బజాజ్ ఫిన్ సర్వ్ 0.98 శాతం, జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ 1.93 శాతం, అదానీ పోర్ట్స్ 1.48 శాతం, అల్ర్టాటెక్ 2.37 శాతం నష్టాల్లో కనిపించాయి. ఇక ఇంధన, టెలికాం, విద్యుత్ ,రియల్ , సేవలు కొంత తగ్గాయి. బీఎస్ ఈలో 1442 షేర్లు లాభాలను చవిచూశాయి. 2485 షేర్లు నష్టపోయాయి. 109 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండానే ముగిశాయి.

    ఇక లోహ షేర్లకు సుప్రీం తీర్పు పెద్ద దెబ్బ తగిలేలా చేసింది. 2005 నుంచి ఖనిజ తవ్వకాలపై రాయల్టీ వసూలు చేసుకోవచ్చని తీర్పునివ్వడం లోహ షేర్లు దెబ్బతిన్నాయి. ఇందులో ఎస్ఎండీసీ, మెయిల్, కోల్ ఇండియా, హిందూస్థాన్ కాపర్, నాల్కో, సెయిల్, జీఎండీసీ, వేదాంత, టాటాస్టీల్ సంస్థలు నష్టాన్ని చవిచూశాయి. హిందూస్థాన్ జింక్ లో 3.312 శాతం వాటా ఆఫర్ ఫర్ సేల్ లో భాగంగా 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు విక్రయించేందుకు వేదాంత సిద్ధమైంది. రూ. 486తో ఒక్కో షేరు కనీస ధరగా నిర్ణయించింది.

    బుధవారం హిందూస్థాన్ షేర్ ముగింపు ధర రూ. 572.95 వద్ద నమోదైంది. అంటే 15 శాతం తగ్గింపుతో వేదాంత ఈ షేర్లను విక్రయిస్తున్నది. సుమారు రూ. 14 కోట్ల వరకు షేర్లను వేదాంత విక్రయించేందుకు సిద్ధమైనట్ల సమాచారం. సుమారు 3.31 శాతం వాటా విక్రయంతో వేదాంత సుమారు రూ. 6 వేల కోట్లను సమీకరించుకోవాలని చూస్తున్నది.

    ఇక సరస్వతీ శారీ డిపో ఐపీవో ఆఖరి రోజు మొత్తంగా 107.39 రెట్ల స్పందన లభించింది. ఈ ఇష్యూలో భాగంగా 1,07,39,63,880 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇక గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, బులియన్, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు గురువారం పనిచేయవు.