https://oktelugu.com/

Thangalaan:’తంగలాన్’ చిత్రాన్ని తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనేనా..? తెలివిగా తప్పించుకున్నాడుగా!

తమిళనాడు లో ఈ ఏడాది విడుదలైన సినిమాలలో కేవలం విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' మాత్రమే సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన ఏ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. అలాంటి సమయంలో 'తంగలాన్' చిత్రం నేడు విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని అద్భుతమైన ఓపెనింగ్స్ ని రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 15, 2024 / 04:25 PM IST

    Thangalaan(1)

    Follow us on

    Thangalaan: నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన సినిమాలలో అన్నిటికంటే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం, తమిళ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్. పీఏ రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుండే భారీ అంచనాలు ఉండేవి. ముఖ్యంగా హీరో విక్రమ్ గెటప్ చాలా కొత్తగా ఉండడాన్ని చూసి ఆయన అభిమానులు సైతం షాక్ కి గురి అయ్యారు. ఇక నేడు విడుదలైన ఈ సినిమాలో విక్రమ్ తన నటవిశ్వరూపం చూపించి, సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు, ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కల్గించింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

    తమిళనాడు లో ఈ ఏడాది విడుదలైన సినిమాలలో కేవలం విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ మాత్రమే సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన ఏ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. అలాంటి సమయంలో ‘తంగలాన్’ చిత్రం నేడు విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని అద్భుతమైన ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇదే ఊపు ని ఈ చిత్రం ఫుల్ రన్ లో కూడా కొనసాగిస్తుందని ట్రేడ్ పండితులు బలమైన నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఆడియన్స్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి బాగా విసిగిపోయారు. ఇలాంటి కొత్త తరహా సినిమాలు వస్తే, భాష ప్రాంతంతో సంబంధం లేకుండా ఎగబడి చూస్తున్నారు. అలా ఈ ‘తంగలాన్’ చిత్రం మరో ‘కాంతారా’ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాని తొలుత విక్రమ్ తో కాకుండా మన టాలీవుడ్ స్టార్ హీరోతో తియ్యాలని పీఏ రంజిత్ చాలా ప్రయత్నం చేసాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఎలాంటి తరహా పాత్రని అయిన అలవోకగా చెయ్యగల హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. నటనలో కొత్తదనం చూపించాలనే కసి ఆయనలో ఉన్నంతగా ప్రస్తుతం ఏ టాలీవుడ్ హీరోలో కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ కి కూడా ఈ క్యారక్టర్ చెయ్యడం ఇష్టమే కాదు, అప్పటికే ఆయన పుష్ప సిరీస్ కి కమిట్ అవ్వడం వల్ల వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టలేకపోయాడు. ఆ తర్వాత చాలా కాలం అల్లు అర్జున్ కోసం ఎదురు చూసిన రంజిత్, ఇక డేట్స్ దొరకడం కష్టమే అని విక్రమ్ వద్ద కి వెళ్ళాడు. విక్రమ్ ఈ స్టోరీ వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించేసాడు. అలా ఈ క్రేజీ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతుల నుండి విక్రమ్ చేతికి మారింది. అయితే అల్లు అర్జున్ కమర్షియల్ స్టార్ హీరో, ఆయన ఇలాంటి గెటప్స్ వేస్తే మన ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి మింగుడు పడదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, అల్లు అర్జున్ ఈ సినిమాని మిస్ చేసుకోవడం వల్ల అతనికి మేలు జరిగింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.