https://oktelugu.com/

FD Rates: ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా..? ఈ సమాచారం మీ కోసమే.. ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీ చెల్లిస్తున్నాాయంటే..?

ఫిక్స్ డ్ డిపాజిట్(ఎఫ్ డీ) అనేది అనేక పెట్టుబడుల్లో ఒకటి. ఇది ఒక సురక్షిత ఇన్వెస్ట్ మెంట్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిర్దిష్ట పూర్వకంగా చేసే ఏకకాల నగదు మొత్తాలపై నిర్ణీత కాలవ్యవధులకు గానూ సుస్పష్టమైన రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ లను చెల్లిస్తారు.

Written By:
  • Mahi
  • , Updated On : August 26, 2024 / 05:41 PM IST

    Fixed Deposits

    Follow us on

    FD Rates: ఫిక్స్ డ్ డిపాజిట్(ఎఫ్ డీ) అనేది అనేక పెట్టుబడుల్లో ఒకటి. ఇది ఒక సురక్షిత ఇన్వెస్ట్ మెంట్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిర్దిష్ట పూర్వకంగా చేసే ఏకకాల నగదు మొత్తాలపై నిర్ణీత కాలవ్యవధులకు గానూ సుస్పష్టమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లను చెల్లిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, పోస్టాఫీసులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు బ్యాంకింగేతర ఆర్థిక రంగ సంస్థల్లో ఫిక్డ్స్ రేట్ల స్కీములు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ రిస్కులకు దూరంగా ఉండాలనుకునే పెట్టుబడిదారులకు ఈ ఫిక్స్ డ్ డిపాజిట్లు మంచి పెట్టుబడి సాధనాలుగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా మన పెట్టుబడుల్లో విభిన్నాలను చూపుతూ మార్కెట్, నాన్ మార్కెట్ లింక్ డ్ ఆప్షన్లను ఎంచుకోవాలనుకునేవారికి ఈ ఫిక్స్ డిపాజిట్లు సరైనవిగా చెప్పవచ్చు. సాధారణ డిపాజిటర్లకు, సీనియర్ పౌరులకు కొంత పెద్ద మొత్తంలో బ్యాంకులు, ఎన్బీ ఎఫ్సీలు వడ్డీ ఇస్తున్నాయి. బ్యాంకులు రుణాలను ఎక్కువగా ఇస్తున్నాయని, డిపాజిట్లు మాత్రం తగ్గిపోతున్నాయని, రెండింటి మధ్య బ్యాలెన్స్ లేకపోతే ఇబ్బందులు తప్పవని ఆర్ బీ ఐ, కేంద్ర మంత్రిత్వ శాఖలు హెచ్చరించిన నేపథ్యంలో బ్యాంకింగ్ రంగం ఫిక్స్ డ్ డిపాజిట్ల వృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వివిధ కాలపరిమితి ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచాయి.

    ప్రస్తుతం జనరల్, సీనియర్ పౌరులకు అత్తుత్తమ వడ్డీరేట్లు ఏ సంస్థల్లో లభిస్తున్నాయో వాటి గురించి తెలుసుకుందాం..
    * 500రోజుల ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఆర్బీఎల్ సాధారణ వినియోగదారులకు అధికంగా 8.10శాతం వడ్డీ చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే 8.60 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
    * 55నెలల ఎఫ్ డీపై హెచ్డీఎఫ్సీ 7.40శాతం వడ్డీ చెల్లిస్తున్నది.
    * 666రోజుల ఫిక్స్ డ్ డిపాజిట్లపై బీవోఐ7.30శాతం వడ్డీరేటు ఇస్తున్నది.
    * 444రోజుల ఎఫ్ డీపై ఐవోబీ 7.30శాతం వడ్డీరేటు చెల్లిస్తున్నది.
    * 444రోజుల ఎఫ్ డీలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ 7.25శాతం వడ్డీ ఇస్తున్నది. అదే సీనియర్ సిటిజన్లకైతే 7.75శాతం చెల్లిస్తున్నది.
    * రెండేండ్ల ఎఫ్ డీలకు ఐసీఐసీఐ 7.25శాతం వడ్డీరేటును ప్రకటించింది.
    * 399రోజుల కాలానికి గానూ బీవోబీ 7.25శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75శాతం చెల్లిస్తున్నది.
    * 400 రో జుల ఎఫ్ డీలపై పీఎన్బీ 7.25శాతం వడ్డీ చెల్లించనున్నట్టు ప్రకటించింది.
    * 375 రోజుల కాలానికి ఐడీబీఐ 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75శాతం చెల్లిస్తున్నది.

    ఫిక్స్ డ్ డిపాజిట్లలో రకాలు..
    – కార్పొరేట్ ఫిక్స్ డ్ డిపాజిట్లు ఈఎఫ్ డీలను కంపెనీలు చెల్లిస్తాయి.
    – స్టాండర్డ్ ఫిక్స్ డ్ డిపాజిట్లు బేసిక్ ఇన్వెస్టిమెంట్ స్కీములు. నిర్దిష్ట కాల వ్యవధి పూర్తయిన తర్వాత డిపాజిట్లను చెల్లిస్తాయి.
    – సీనియర్ సిటిజన్ ఫిక్స్ డ్ డిపాజిట్లకు 60ఏండ్లు దాటిన వారు మాత్రమే అర్హులు. ముఖ్యంగా చాలా సంస్థలు వీరికి అధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తున్నాయి.
    – ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్లకు పన్నులు మినహాయింపు ఇస్తారు. కాకపోతే గరిష్ఠంగా సంవత్సరానికి 1.50 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎఫ్ డీ కాలవ్యవధి మాత్రం ఐదేండ్లు ఉంటుంది.
    – ఎన్ఆర్వో ఎఫ్ డీ అకౌంట్ ఎన్నారైలు ఇండియా నుంచి పొందే ఇన్కం బట్టి ఈ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై వచ్చే వడ్డీని పూర్తిగా తీసుకోవచ్చు. కానీ, పన్నులు వర్తిస్తాయి.
    – ఎన్ఆర్ ఈ ఎఫ్ డీ అకౌంట్ ఎన్ఆర్ఐలు ఈ నాన్ రెసిడెంట్ ఎక్స్ టర్నల్ ఖాతాను ఇండియాలో చేసుకోవచ్చు. విదేశాల్లో ఆర్జించే డబ్బును కూడా ఇందులోడిపాజిట్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. ఈ డిపాజిట్లపై పొందే వడ్డీ మొత్తాలను పూర్తిగా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. వీటికి ఎలాంటి పన్నులు ఉండవు.