Aamir Khan: బాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు అమీర్ ఖాన్. ఈయన సినిమాలు విడుదలైతే ఓపెనింగ్ రికార్డ్స్ నుండి క్లోసింగ్ వరకు కళ్ళు చెదిరే రికార్డ్స్ నమోదు అవుతూ ఉంటాయి. ఒకానొక దశలో బాలీవుడ్ లో అమీర్ ఖాన్ రికార్డ్స్ ని బద్దలు కొట్టే హీరో ఉండేవారు కాదు. ఆయన రికార్డ్స్ ని కేవలం ఆయన మాత్రమే బద్దలు కొట్టే పరిస్థితి ఉండేది. అలాంటి అమీర్ ఖాన్ కి ‘దంగల్’ చిత్రం తర్వాత ‘తగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘ లాల్ సింగ్ చద్దా’ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఫ్లాప్స్ అవ్వడంతో అమీర్ ఖాన్ కి కూడా ఫ్లాప్స్ వస్తాయా అని ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే రీసెంట్ గానే ఆయన ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘నాకు ఇప్పుడు 59 ఏళ్ళు వచ్చాయి.
మిగిలిన జీవితాన్ని ఒంటరిగా బ్రకటడం చాలా కష్టమే. అలా అని మూడవసారి పెళ్లి చేసుకునే ఓపిక కూడా నాకు లేదు. కానీ తోడు మాత్రం కావాలి, దానిని డేటింగ్ అని పిలిచినా, పెళ్లి అని పిలిచినా, ఎలా పిలిచినా నాకు పర్వాలేదు. ప్రస్తుతం నా ఇద్దరు భార్యలు నాతో విడిపోయినప్పటికీ మంచి స్నేహం గానే ఉంటారు. మేమంతా కలిసి ఉంటున్నాము. నాపై ఇప్పుడు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అందుకోసం నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. 1986 వ సంవత్సరం లో అమీర్ ఖాన్ రీనా దుత్త అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులిద్దరికీ జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇరా ఖాన్ కి రీసెంట్ గానే పెళ్లి కూడా దగ్గరుండి చేయించాడు. 16 ఏళ్ళ పాటు రీనా దుత్త తో సంసారం జీవితాన్ని కొనసాగించిన అమీర్ ఖాన్, కొన్ని అనుకోని సంఘటనల కారణంగా 2002 వ సంవత్సరం లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆయన 2005 వ సంవత్సరంలో కిరణ్ రావు ని పెళ్లాడాడు. 2021 వ సంవత్సరం లో వీళ్ళిద్దరూ కూడా కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన దంగల్ చిత్రం ఫేమ్ ఫాతిమా సనా షేక్ తో డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు. ఇదంతా పక్కన పెడితే అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘సితారే జమీన్ పర్’ అనే చిత్రం చేస్తున్నాడు. ‘తారే జమీన్ పర్’ అనే చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత త్వరలోనే ఆయన లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి.