https://oktelugu.com/

Raghuramaraju : కెలుక్కొని మరీ తిట్టించుకున్న రఘురామరాజు.. వైరల్ వీడియో

గతంలో ఏకంగా సీఐడీని ఉసిగొల్పి మరీ ట్రిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ఇప్పటికైనా ఎదుటి వారిని కెలుక్కోవడం మానుకుంటే ఉత్తమమని ఎక్కువ మంది సలహా ఇస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 21, 2023 1:22 pm
    Follow us on

    Raghuramaraju : వైసీపీతో విభేదిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామరాజు టైమ్ ఏమంతా బాగాలేదు. నిత్యం ఏదో ఒక వివాదం ఆయన చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఆయనే వివాదాల జోలికి వెళతాడో.. లేకుంటే అవే ఆయనకు చుట్టు ముడతాయో తెలియదు కానీ.. తిట్టడం, కొట్టడం వంటి వాటికి బాధితుడిగా మారుతుండడం మాత్రం కాస్తాంత బాధాకరమే. తాజాగా విశాఖ ఎంపీ ఎంవీఎస్ సత్యనారాయణతో రఘురామరాజు అమ్మనా బూతులు తిట్టుంచుకున్నాడు. అంతటితో చాలదన్నట్టు నేనేమీ అనకుండానే తనను తిట్టినట్టు ప్రెస్ మీట్ పెట్టి మరీ రఘురామరాజు చెప్పుకొచ్చారు. అయితే ఎవరినైనా కెలికితే అలానే ఉంటుందని సెటైర్లు పడుతున్నాయి. రాజుగారిని వెనుకేసుకొచ్చే వారి కంటే తప్పుపట్టే వారే అధికమవుతున్నారు.

    అనువుగాని చోట అధికులం కాదు అన్న సామెతను రఘురామరాజు మరిచిపోతున్నారు. వైసీపీని విభేదించవచ్చు.. కానీ అదే పనిగా వ్యవహారాలు నడపడం కాస్తా ఎబ్బెట్టుగా ఉంటుంది. స్థాయిని దిగజార్చుతుంది. ఎప్పుడో ఒకసారి నిర్ణయాత్మక అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎప్పుడూ ఎల్లో మీడియాకు అవసరమైన బైట్లు ఇస్తే.. దాని రెస్పాన్స్ ఇలానే ఉంటుంది. ప్రతిఒక్కరి వ్యవహారాల్లో తలదూర్చితే  రిప్లయ్ బూతులు, దాడులు మాదిరిగానే ఉంటుంది. ఈ విషయంలో వైసీపీ నేతలు ఎంత దూకుడుగా ఉంటారో తెలియంది కాదు.

    అయితే ఇంతకీ ఎంవీ సత్యనారాయణ ఈ రేంజ్ లో విరుచుకుపడడానికి కారణమేంటో తెలుసా? నెల రోజుల కిందట ఆయన కుటుంబసభ్యులు కిడ్నాపర్ల చెరలో పడ్డారు. అతి కష్టమ్మీద బయటపడ్డారు. దాని వెనుక కథ, కమామిషులు చాలా నడిచాయి. అవి రాజుగారికి కూడా తెలుసు. ఎంపీ సత్యనారాయణ కూడా కక్కలేక మింగలేక చాలా మాటలు బయటపెట్టారు. తీవ్ర అంతర్మథనంతో తనకు విశాఖలో వ్యాపారులు సెట్ కావని తేల్చేశారు. హైదరాబాద్ సేఫ్ జోన్ అని చెప్పి వైసీపీని ఇరుకునపెట్టారు. అయితే ఎలాగోలా వ్యవహారం మరుగునపడిందనే సరికి రఘురామరాజు దాన్ని కెలికారు. దీనిపై జాతీయ స్థాయిలో విచారణ చేపట్టాలని ఏకంగా ప్రధానికి లేఖ రాశారు. దీంతో ఎంపీ ఎంవీ సత్యనారాయణ రెచ్చిపోయారు. బూతులతో రెచ్చిపోయారు.

    ముందు మన నడవడిక బాగుండాలి. అందరితో కలివిడి తనం మెంటైన్ చేయాలి. అందునా వైసీపీని విభేదిస్తున్న లోక్ సభ్యుడిగా ఉన్నారు. ఇటువంటి సమయంలో చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రఘురామరాజు అదే పనిగా నోటికి పనిచెప్పారు. కొంద‌రికి ఆయ‌న మాట‌లు తేనెలా తియ్య‌టి రుచి క‌లిగిస్తున్నాయి. మ‌రికొంద‌రికి చేదు అనిపిస్తున్నాయి. చేదు అనిపించిన వాళ్ల నుంచి రియాక్ష‌న్ భారీ స్థాయిలో ఎదురవుతోంది. గతంలో ఏకంగా సీఐడీని ఉసిగొల్పి మరీ ట్రిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ఇప్పటికైనా ఎదుటి వారిని కెలుక్కోవడం మానుకుంటే ఉత్తమమని ఎక్కువ మంది సలహా ఇస్తున్నారు.