Best 7 Seater Cars: తక్కుబ బడ్జెట్ లో లభించే 7 సీటర్ కార్లు ఏవో తెలుసా?

దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుంది మారుతి సుజుకీ కంపెనీ. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు ఇప్పటికే రిలీజ్ అయి ఆకట్టుకున్నాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి 7 సీటర్ వరకు అన్ని మోడళ్లు తక్కువ బడ్జెట్ లో అందించడానికి ప్రయత్నిస్తోంది.

Written By: Chai Muchhata, Updated On : January 7, 2024 1:05 pm

Best 7 Seater Cars

Follow us on

Best 7 Seater Cars: నేటి కాలంలో కారు కొనుగోలు చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఏ కారు కొనాలి? అనే సందేహం కలుగుతోంది. సొంత అవసరాలతో పాటు ఫ్యామిలీ టూర్ కోసం ఉపయోగించుకోవాలనుకునేవారు 7 సీటర్ కారు కోసం సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే దూర ప్రయాణాలు చేసేవారు సొంత వెహికల్ ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలో 7 సీటర్ కార్లకు ప్రాధాన్యత పెరిగింది. మిగతా కార్లతో పాటు 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీలు సైతం వాటి ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇదే సమయంలో తక్కువ బడ్జెట్ తో సామాన్యులకు కార్లు అందించాలని అనుకుంటున్నాయి. అయితే తక్కువ ధరకు లభించే 7 సీటర్ కార్లు ఏవో చూద్దాం..

దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుంది మారుతి సుజుకీ కంపెనీ. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు ఇప్పటికే రిలీజ్ అయి ఆకట్టుకున్నాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి 7 సీటర్ వరకు అన్ని మోడళ్లు తక్కువ బడ్జెట్ లో అందించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఎర్టీగా 7 సీటర్ విపరీతమైన అమ్మకాలు జరుపుకుంటోంది. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 105 బీహెచ్ పీ పవర్, 138 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.8.64 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

తక్కువ బడ్జెట్ లోనే 7 సీటర్ అందించే మరో కంపెనీ రెనాల్ట్. ఈ కంపెనీకి చెందిన ట్రైబర్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 72 బీహెచ్ పీ పవర్, 96 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే లీటర్ కు 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.6.33 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 7 సీటర్ కార్ల ఉత్పత్తిలో మరో కంపెనీ మహీంద్రా ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ నుంచి బొలెరో నియో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 100 బీహెచ్ పీ వపర్, 260 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ 9.64 లక్షలుగా ఉంది.