16-year-olds earning crores: సాయంత్రం మార్కెట్ కు వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన కొన్ని తినుబండారాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని చూడగానే నోరూరుతుంటుంది. వెంటనే వాటిని ఎడాపెడా తినేస్తూ ఉంటాం. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్ని రోజుల్లో ఇవి పాయిజన్ గా మారి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. అలా బీహార్ కు చెందిన చెందిన ఓ కుర్రాడు రోడ్డు పక్కన కనిపించిన thekua అనే తీపి పదార్థాన్ని తిన్నాడు. ఇది తిన్న తర్వాత అతనికి వారం రోజులపాటు జ్వరం వచ్చింది. ఇలా రోడ్డు పక్కన అమ్మే పదార్థాలు ఇంత దారుణంగా ఉంటాయని అనుకున్నాడు. దీంతో అసలు ఇంత మంచి పదార్థాలను హైజెనిక్ గా తయారుచేసి అమ్మితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన ఆ 16 ఏళ్ళ కుర్రాడికి ఆలోచన వచ్చింది. ఆ తర్వాత మరో స్నేహితులతో కలిసి అతడు చేసిన పనికి కోటి రూపాయల ఆదాయాన్ని పొందారు. అసలు ఇంతకు ఆ ఇద్దరు కుర్రాళ్ళు కలిసి ఏం చేశారు?
ప్రస్తుత కాలంలో 16 ఏళ్ల వయసు ఉన్నవారు చేసే ప్రధాన పని ఏంటంటే.. చేతిలో మొబైల్ పట్టుకొని రీల్స్ తీయడం.. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం.. బైక్ పై సరదాగా తిరగడం వంటివి ఉంటాయి. కానీ ఇతర గుర్రాలు చిన్న వయసులోనే అతిపెద్ద వ్యాపార బాధ్యతను నిర్వహిస్తున్నారు. బీహార్ కు చెందిన జయంత అనే కుర్రాడు ఒకసారి పండుగలో thekua అని స్వీటును తిని వారం రోజులపాటు అనారోగ్యానికి గురయ్యాడు. అయితే వీటిని నాణ్యమైనవిగా తయారుచేసి ప్రజలకు అందించాలని అనుకున్నాడు. ఇందుకోసం కైలాస్ అనే వ్యక్తిని కలిసి ఇందులో భాగం చేసుకున్నాడు. కైలాస్ అనే వ్యక్తి అప్పటికే చదువు మానేసి రైల్వే స్టేషన్లో కూలిగా ఉన్నాడు. దీంతో జయంత చెప్పిన ఆలోచన అతనికి నచ్చింది. ఆ తర్వాత ఇంట్లో ఇద్దరు కలిసి తెకువ అనే స్వీటును నాణ్యమైనది గా తయారుచేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి విక్రయాలు ప్రారంభించారు.
అయితే మొదటి రెండు నెలలపాటు వీరికి ఎలాంటి ఆర్డర్ రాలేదు. దీంతో తాము చేసే వ్యాపారం మధ్యలోనే ఆగిపోతుందని అనుకున్నారు. కానీ వారి ఉత్పత్తులను సోషల్ మీడియాలో పరిచయం చేశారు. ఆ తర్వాత చిన్న పట్టణాల నుంచి వారికి ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. అలా మెట్రోపాలిటన్ నగరాలకు వీరు ఉత్పత్తులు విస్తరించాయి. ఆ తర్వాత వీరు తెకువ స్వీట్ తో పాటు మఖాన, బనానా చిప్స్, దేశంలో అడ్డు వంటి పదార్థాలను కూడా తయారుచేసి వినియోగదారులకు పరిచయం చేశారు. అన్ని రకాల ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరిగింది.
అలా మొత్తంగా వీరు 3 లక్షల మందికి తమ ఉత్పత్తులను విక్రయించారు. ఫలితంగా వీరు కోటి రూపాయల ఆదాయాన్ని పొందారు. 16 ఏళ్ల వయసులోనే కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్న వీరిని చూసి అంతా షాక్ అయ్యారు. అయితే వీరు కేవలం నాణ్యమైన ఉత్పత్తులను అందించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అదే వీరి వ్యాపార విస్తరణకు కారణం అయింది.