Poco Pad 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ పోకో తాజాగా మరో మోడల్ ట్యాబ్లెట్ అందుబాటులోకి తెచ్చింది. పోకో ప్యాడ్ 5G ట్యాబ్లెట్ ఇటీవల భారత్ మార్కెట్లో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ ప్యాడ్ అన్ని గ్యాడ్జెట్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఇక ఈ పోకో ట్యాబ్లెట్ 12 అంగుళాల డిసి ప్లే, స్నాప్టాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్, 10000mAh బ్యాటరీ తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రారంభ ఆఫర్ సేల్ లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై తగ్గింపు ధరలను పోకో అందజేస్తున్నది. ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఫ్లిఫ్ కార్ట్ ద్వారా ఈ మోడల్ ట్యాబ్లెట్ ను కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేక ఫీచర్లతో ఈ మోడల్ ను పోకో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం 2560*1600 పిక్సల్ రిజల్యూషన్, 120హెచ్ జడ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్, 16:10 ఆస్పెక్ట్ రేషియోను ఈ మోడల్ ట్యాబ్లెట్ కలిగి ఉంది. ఈ డిసి ప్లే కార్నింగ్ గెర్రిల్లా గ్లాస్ రక్షణను కలిగి ఉంటుంది. ఇక ఈ పోకో ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ ను కలిగి ఉంది. స్నాప్టాడ్రాగన్ 7s జెన్ 2 ఎస్ ఓసీ చిప్ సెట్ పైన పనిచేస్తుంది. 8జీబీ ఎల్పీపీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో అందుబాటులోకి వచ్చింది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా గరిష్ఠంగా 1.5 టీబీ వరకు స్టోరేజీని పెంచుకునే అవకాశం ఉంది.
కెమెరా ఫీచర్స్ ఇవే..
ఇక కెమెరా ఫీచర్స్ చూసుకుంటే పోకో ప్యాడ్ 5జీ ట్యాబ్లెట్ వెనుకవైపు 8MP కెమెరా, ఫ్రంట్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 33 వాట్స్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10,000ఎంఏహెచ్ బ్యాటరీ పైన ఈ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. ఇక ఈ ట్యాబ్లెట్ ఐపీ52 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో అందుబాటులో ఉంది. రెండు మైక్రో ఫోన్లు, క్వాడ్ స్పీకర్లను కూడా ఈ మోడల్ కలిగి ఉంది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్టుతో ఈ మోడల్ ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. కనెక్టివిటీ పరంగా పోకో ట్యాబ్లెట్ డ్యూయల్ 5G, వైపై 6, జీపీఎస్, బ్లూటూత్ 5.2, యూఎస్ బీ సీ పోర్టు ఛార్జింగ్ కలిగి ఉంటుంది.
స్టోరేజ్, ధరలు ఇవే..
అయితే పోకో ప్యాడ్ 5జీ ట్యాబ్లెట్ 8జీబీ ర్యామ్ + 128G స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా కంపెనీ నిర్ణయించింది. అదే 8GB ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.25,999 గా ఉంది. దీంతో పాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.3000 వరకు తగ్గింపును పొందే వీలు ఉంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ కోబాల్ట్ బ్లూ, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ప్రముఖ ఈకార్ట్ ఫ్లాట్ ఫాం అయిన ఫ్లిఫ్ కార్టు అందుబాటులో ఉంది. అయితే ఈ వేరియంట్ ట్యాబ్లెట్ ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. పోకో అత్యాధునిక ఫీచర్లతో ఈ మోడల్ ను అందుబాటులోకి తేవడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.