https://oktelugu.com/

Jio- Free Netflix : జియోలో ఉచిత నెట్ ఫ్లిక్స్.. ధర మారింది..ఈ ప్లాన్ లో కొత్త మార్పులు.. వినియోగదారులకు లాభమే..

దేశీయ టెలికాం నెట్ వర్క్ లలో జియో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నది. అసలు జియో వచ్చాక టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఏంటో అందరికీ తెలుసు. తాజాగా జియో ధరలు పెంచుతూ మరో కొత్త ప్లాన్ ను ప్రకటించింది.

Written By:
  • Mahi
  • , Updated On : August 29, 2024 / 02:15 PM IST

    Jio- Free Netflix

    Follow us on

    Jio- Free Netflix: రిలయన్స్ జియో సంస్థ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచింది. కాంప్లిమెంటరీ నెటఫ్లెక్స్ సబ్స్క్రిప్షన్లతో వచ్చేప్రీపెయిడ్ ప్లాన్ లో ఈ మార్పు ఉంటుంది. ఈ టారిఫ్ లో పెరుగుదల ఈ ఏడాది ప్రారంభంలోనే ఉంది. భారతదేశంలోని టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ల రేట్లను పెంచే ధోరణిని పేర్కొంది. అయితే జియోలొ జూలై 3 నుంచి ఈ పెంచిన ఆఫర్లు అమల్లోకి వచ్చాయి. మరోవైపు పోటీ కంపెనీలైన వొడాఐడియా, భారతీఎయిర్ టెల్ కూడా ఏకకాలంలో తమ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ధరలను పెంచి ప్రకటించాయి. దీంతో జియో మరో కొత్త ఆఫర్ ను అందుబాటులో కి తెచ్చింది, ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్ర్కిప్షన్ తో కొత్త ప్లాన్ తెచ్చింది. జియో ప్రీపెయిడ్ పాన్లు 84 రోజుల చెల్లుబాటుతో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు రూ. 1,299 , రూ. 1,799 గా ఉన్నాయి. అయితే మొదట ఈ ఈ ప్లాన్లు రూ. 1,099, రూ. 1,499 గా ఉండేది. తాజాగా వీటిని పెంచింది. మొదటగా రూ. 1299 ప్లాన్ లో నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ మాత్రమే వర్తిస్తుంది. ఇక మరో ప్లాన్ రూ. 1,799 ని ఎంపిక చేసుకుంటే నెట్ ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ వర్తిస్తుంది. దీనిని వినియోగదారులు గమనించాల్సి ఉంటుంది.

    ఇక జియో తెచ్చిన ఈ రూ. 1,299 ప్రీపెయిడ్ ప్లాన్ లో నెట్ ఫ్లిక్స్ ప్లాన్ లో వినియోగదారుడు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లో ఏదో ఒకటి కలిగి ఉండాలి. ఈ ప్లాన్ తో వినియోగదారులు యాప్ లో పొందగలిగే అత్యధిక నాణ్యత గల వీడియో స్ట్రీమింగ్ 480పీ ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ఫోన్, టాబ్లెట్, స్మార్ట్ టీవీ, ల్యాప్ టాప్ లలో ఏదైనా వినియోగించుకోవచ్చు. ఈ రూ.1,799 ప్లాన్ తో గరిష్టంగా 720p నాణ్యతతో వీడియోలు చూడవచ్చు. వినియోగదారులను మరింత అలరించేందుకు జియో ఈ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ ను అందిస్తున్నది. అయితే రానున్న రోజుల్లో ఈ ప్లాన్ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    ప్రస్తుతం జియో అందిస్తున్న ఈ రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్లు 84 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ రీచార్జీ చేసుకున్నాక ప్రతి వినియోగదారుడు మూడు నెలల కాంప్లిమెంటరీ నెట్ ఫ్లిక్స్ సబ్ స్ర్కిప్షన్ ను పొందుతారని తెలిపింది. దీంతో పాటు రోజుకు 100 ఎస్ ఎంఎస్ లు, అపరిమితి టాక్ టైమ్, అపరిమిత 5G కనెక్టివిటీని కూడా వినియోగదారులు పొందుతారు. కచ్చితంగా ఈ ప్లాన్ వినియోగదారులకు మరింత చేరువ అవుతుందని జియో ప్రతినిధులు చెబుతున్నారు.

    ఇక దీంతో పాటు వినియోగదారుడి నివాస ప్రాంతంలో 5జీ కనెక్టివిటీ ఉండడం కూడా ముఖ్యమే. జియో రూ.1,299, రూ. 1,799 ప్రీపెయిడ్ ప్లాన్లు వరుసగా 2 జీబీ , 3జీబీ రోజువారీ హైస్పీడ్ డేటాను అందిస్తాయి. ఇక ఈ పరిమితి తర్వాత, అపరిమిత డేటా 64కేబీపీఎస్ వద్ద అనుమతిస్తారు. ఇదే జియో తెచ్చిన ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్ర్కిప్షన్ ప్లాన్.