Car Tax: కారు షికారుకెళ్లాలని ఒకప్పుడు కలలు కనేవారు. కానీ ఇప్పుడు ఆ కలను తొందరగానే నెరవేర్చుకుంటున్నారు. మనుషుల ఆదాయం పెరగడంతో పాటు కార్ల ధరలు అందుబాటులో ఉండడంతో చాలా మంది సొంత కారును కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు సైతం ఆయా వర్గాల పీపుల్స్ కు అనుగుణంగా వివిధ మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నాయి. నేటి రోజుల్లో రూ.5 లక్షల నుంచి కోటి వరకు కార్లు ఉన్నాయి. అయితే ఎలాంటి కారు కొనుగోలు చేసినా అదనంగా కొన్ని ఖర్చులు ఉంటాయి. వీటిలో ప్రధానంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ కారు కొనుగోలు చేస్తే ఎంత ట్యాక్స్ ప్రభుత్వానికి వెళుతుందంటే?
జీఎస్టీ వచ్చిన తరువాత ప్రతీ వస్తువు కొనుగోలుపై ప్రభుత్వానికి ట్యాక్స్ తప్పనిసరిగా కట్టాల్సింది. ఆయా వస్తువుల ధరలను భట్టి జీఎస్టీ మారుతూ ఉంటుంది. సెంట్రల్ జీఎస్టీతో పాటు స్టేట్ జీఎస్టీలు వస్తువుల కొనుగోలుపై విధిస్తారు. కొన్ని వస్తువులకు మినహా మిగతా వస్తువులకు కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కారు కొనుగోలు చేసేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను వెళుతూ ఉంటుంది. కానీ దీనిన చాలా మంది గుర్తించరు.
ఒక కారు కొనుగోలు పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి 14 శాతం వరకు జీఎస్టీ వెళుతుంది. ఈపన్న ఎక్స్ షోరూం కారుపైనే విధిస్తారు. ఇందులో కారు ప్రైస్ తో పాటు జీఎస్టీని కూడా పే చేయాలని బిల్లులో రూపొందిస్తారు. సాధారణంగా కారు ధర కు 14 శాతం అంటే కనీసం లక్ష రూపాయల వరకు ప్రభుత్వానికి పన్నుల చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరకు 17 లక్షలతో ఒక కారు కొనుగోలు చేస్తే ఇందులో 14 శాతం అంటే.. 2 లక్షల వరకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
వీటితో పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జేజ్.. ఇలా అన్ని కలిప 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు పన్నుల రూపంలో వెళుతుంది. కొన్ని కార్లపై ధరలు తగ్గించామని చెబుతూ ఉంటారు. కానీ ఈ చార్జీలతో కలిస్తే ఎక్కువే పే చేయాల్సి ఉంటుంది. అందువల్ల కారు కొనేటప్పుడు ఈ ఖర్చులను కూడా గమనించాలి. ఆ తరువాత బడ్జెట్ కు అనుగుణంగా కారును కొనుగోలు చేయాలి.