Petrol Car Into CNG : పెట్రోల్ కారు నుంచి CNG కారుగా మార్చుకోవాలా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

పెట్రోల్ కారు ఉన్న వారు సీఎన్ జీ కారు కావాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో కొత్త కారును కొనుగోలు చేయాలా? అనే అనుమానం వస్తుంది. కానీ సీఎన్ జీ కారుగా మారడానికి కొత్త కారు కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న పెట్రోల్ కారును సీఎన్ జీగా సులభంగా మార్చుకోవచ్చు. పెట్రోల్ ఉన్న కారులో సీఎన్ జీ ని కొనుగోలు చేయాలంటే రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది.అయితే దీనిని అమర్చడానికి ఎటువంటి ఖర్చులు ఉండవు

Written By: Srinivas, Updated On : July 22, 2024 12:22 pm
Follow us on

Petrol Car Into CNG  :  కార్ల విషయంలో వినియోగదారులు అభిప్రాయాలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. వారి అవసరాలతో పాటు కొన్ని విషయాల్లో కొత్తదనం కోరుకుంటారు. ఇదే సమయంలో కారు ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది వద్ద పెట్రోల్, డీజిల్ కార్లే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ మంది సొంత, కార్యాలయాలకు పెట్రోల్ కార్లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అంతర్జాతీయంగా వస్తున్న మార్పులతో పాటు కొన్ని కారణాల వల్ల పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ ధరు రూ.109 నుంచి విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ధరల్లో తేడాలు ఉంటాయి. పెట్రోల్ వాహనాల వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా పర్యావరణం కాలుష్యంగా మారుతుందని ఇప్పటికే కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ వాహనాల కార్లను తగ్గించాలని ప్రభుత్వం సైతం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ , హైబ్రిడ్ కార్లను తేవాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే పెట్రోల్ వాహనం ఉన్నవారు ఉన్నఫలంగా వాటిని విక్రయించి కొత్త కారును కొనడం సాధ్యం కాదు. అంతేకాకుండా ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల ధరలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా వీటికి ఛార్జింగ్ పాయింట్లు పూర్తిగా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో CNG కార్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని కార్లలో పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఉన్నాయి. కానీ కొన్నింటిలో కేవలం పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంది. అయతే వీరికి సీఎన్ జీ కారు కావాలంటే కొత్త కారు కొనాలా? లేక పెట్రోల్ వాహనాన్ని సీఎన్ జీగా మార్చుకుంటే సరిపోతుందా? ఎంత ఖర్చు అవుతుంది?

పెట్రోల్ కారు ఉన్న వారు సీఎన్ జీ కారు కావాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో కొత్త కారును కొనుగోలు చేయాలా? అనే అనుమానం వస్తుంది. కానీ సీఎన్ జీ కారుగా మారడానికి కొత్త కారు కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న పెట్రోల్ కారును సీఎన్ జీగా సులభంగా మార్చుకోవచ్చు. పెట్రోల్ ఉన్న కారులో సీఎన్ జీ ని కొనుగోలు చేయాలంటే రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది.అయితే దీనిని అమర్చడానికి ఎటువంటి ఖర్చులు ఉండవు.

పెట్రోల్ కార్లను సీఎన్ జీగా మార్చుకుంటే చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధరలు రూ. 100కు పైగానే ఉన్నాయి. అదే సీఎన్ జీ కిలో గ్యాస్ కు రూ.90 లోపు వస్తుంది. లీటర్ పెట్రోల్ కు కార్లను బట్టి యావరేజ్ గా 20 కిలోమీటర్ల లోపే మైలేజ్ వస్తుంది.సీఎన్ జీ ఉన్న కొన్ని కార్లు 30 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అందువల్ల మైలేజ్ ఎక్కువగా కోరుకునేవారికి సీఎన్ జీ కచ్చితంగా అవసరమే అని అంటున్నారు. ఈ నేపత్యంలో సీఎన్ జీ కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.

సీఎన్ జీ కార్ల వల్ల పర్యావరణం కూడా సమతుల్యంగా మారుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ కార్లతో వాతావరణ కాలుష్యం ఏర్పడింది. దీంతో సీఎన్ జీ కార్లను ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. అయితే సీఎన్ జీ కార్ల కోసం గ్యాస్ స్టేషన్లు మరిన్ని పెంచాల్సన అవసరం ఉంది. ప్రస్తుతం అనుకున్న స్టేషన్లు అందుబాటులో లేవు. ఈ కారణంగా చాలా మంది సీఎన్ జీని అమర్చుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అయితే పెట్రోల్ తో పాటు సీఎన్ జీ కూడా ఉండేలా చూసుకుంటున్నారు.

పెట్రోల్ కార్లతో పోలిస్తే సీఎన్ జీ కార్ల మెయింటనెన్స్ తక్కువగానే ఉంటుంది. అయితే పెట్రోల్ కారు నుంచి సీఎన్ జీ కారుగా మార్చుకోవాలంటే మాత్రం ఆర్టీవో నుంచి తప్పనిసరిగి అనుమతి తీసుకోవాలి. వారి నిబంధనలకు అనుగుణంగా సీఎన్ జీని ఏర్పాటు చేసుకోవాలి.