HBD Prabhas: పాన్ ఇండియా హీరో అయిన కూడా నిజమైన గజిని ని నేనే : ప్రభాస్…

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం ఫ్యాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తున్నాడు. నిజానికి ఏ హీరో అభిమానులు అయినా కూడా ప్రభాస్ కి అభిమానులుగా మారిపోతారు. ఎందుకంటే ఆయనకి ఎలాంటి ఇగో ఉండదు. ఆయన ఎలాంటి కాంట్రవర్సీ ల్లో ఇరుక్కోరు అలా ఉండటం వల్లే ఆయనంటే చాలా మందికి ఇష్టం ఏర్పడుతుంది...

Written By: Gopi, Updated On : October 23, 2024 10:52 am

HBD Prabhas(1)

Follow us on

HBD Prabhas: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కనిపించే హీరో ప్రభాస్… తనదైన రీతిలో సినిమాలను చేస్తున్న ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తనను తాను మార్చుకున్న విధానం కానీ, ఆయన సినిమాల సెలక్షన్ లో తీసుకున్న జాగ్రత్తలు కానీ ప్రతి ఒక్కటి ఆయన్ని ఇప్పుడు ఉన్నత స్థానంలో నిలపడంలో చాలావరకు హెల్ప్ చేశాయి. ఇక మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరో తో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ప్రభాస్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఆయన కి పెద్దగా చదువు అయితే అబ్బలేదట. జస్ట్ యావరేజ్ స్టూడెంట్ గానే తన స్కూల్ లైఫ్ మొత్తాన్ని గడుపుతూ వచ్చాడు. తనకు చదువుకోవడం కంటే కూడా డ్రిల్ పిరియడ్ అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే ఆ పిరియడ్లో ఆటలు ఆడిస్తారు కాబట్టి తన పెద్ద స్పోర్ట్స్ మాన్ కనప్పటికి వాలీబాల్ అంటే తనకు చాలా ఇష్టమట. ఇక తను చేసే ప్రతి పనిలో ఏదో ఒక అసంతృప్తి అయితే ఉండేదని తను దేని మీద పెద్దగా ఫోకస్ చేసేవాడిని కాదని ఆయన చెప్పడం విశేషం… ఇక దాని వల్ల ప్రభాస్ ను చూసిన చాలా మంది ఆయన ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటాడని అనుకునేవారట.

ఇక తన ఫ్రెండ్స్ అయితే అతనిని ఒక గజినిలా చూసేవారట.ఎందుకంటే తను ప్రతిదీ మర్చిపోతూ ఉండేవాడట. పెన్ను మర్చిపోయి పరీక్ష హాల్ కి హాజరయ్యేవాడు. పక్కవాళ్ళు పెన్నిస్తే పరీక్ష రాసేవాడట… అలా చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉండటం వల్ల తన ఫ్రెండ్స్ తనని మతిమరుపు ఉన్న వ్యక్తిగా భావించవారట. అలా నిజమైన గజిని నేనే అంటూ ప్రభాస్ ఒక సందర్భం లో తెలియజేశాడు…ఇక మొత్తానికైతే ఒకరోజు తను హీరో అవుతానని తన ఫ్రెండ్స్ దగ్గర చెబితే వాళ్ళు ‘నువ్వు హీరో ఏంట్రా’ అంటూ హేళన చేశారట.

కానీ ప్రభాస్ డిస్సాపాయింట్ అవ్వకుండా ఇంట్లో వాళ్లకు చెప్తే ప్రభాస్ వాళ్ల నాన్న, పెద నాన్న ఇద్దరు సపోర్ట్ చేసి యాక్టింగ్ లో మెలుకువలు నేర్చుకోవడానికి సత్యానంద్ గారి దగ్గరికి పంపించారట…ఇక మొత్తానికైతే అలా ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఇక ఈశ్వర్ సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం ప్రపంచ స్థాయి హీరోగా ఎదిగే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో సాధించిన విజయాల గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరమైతే ఉంది…