ATM Card : నేటి కాలంలో చాలా మంది బ్యాంకుతో ఏదో రకంగా ఆర్థిక వ్యవహారాలు జరుపుతూ ఉన్నారు. బ్యాంకుకు వచ్చే ఖాతాదారుల సంఖ్య పెరగడంతో డబ్బు అవసరం ఉన్న వారు బ్యాంకుకు వచ్చి సమయం వెచ్చించకుండా ATM(Any Time Money) మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతీ బ్యాంకు తమ ఖాతాదారుల కోసం కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ఏటీఎం లను ఏర్పాటు చేసింది. అయితే కొన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంలు సాంకేతిక కారణాలు వల్ల అప్పుడప్పుడు పనిచేయవు. అంతేకాకుండా కొన్ని సార్లు ఏటీఎం కార్డు పెట్టిన తరువాత డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ వస్తుంది. కానీ డబ్బులు రావు. ఇలాంటి సమయంలో కొందరు బ్యాంకులను సంప్రదిస్తారు. అయితే బ్యాంకుకు వెళ్లకుండా ఇలా చేయడం వల్ల డబ్బులు అకౌంట్లో పడుతాయి. ఒకవేళ బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తే అదనంగా ఖాతాదారులకు ఫెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఈ వివరాల్లోకి వెళితే..
పట్టణాల్లో, నగరాల్లో చాలాచోట్ల ఏటీఎంలు కనిపిస్తూ ఉంటాయి. కానీ అత్యవసర సమయాల్లో కొన్ని పనిచేయవు. కొన్ని పైకి పనిచేసినట్లు కనిపించినా.. డబ్బు కోసం ఏటీఎంలో కార్డు పెట్టగానే.. బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. కానీ డబ్బులు రావు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఆందోళన ఉంటుంది. అయితే కొందరు వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదిస్తారు. అయితే ఏటీఎంలు ఉన్న చోట్ల బ్యాంకులు ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో కస్టమర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలి. దీంతో 5 రోజుల్లో బ్యాంకులు డబ్బులు జమ అవుతాయి. అయితే బ్యాంకులో 5 రోజుల్లో డబ్బుు జమ కాకపోతే బ్యాంకులు ఖాతాదారులకు ఫెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అదెలాగంటే?
బ్యాంకు ఏటీఏంలో డబ్బుల కోసం కార్డు పెట్టిన తరువాత అకౌంట్ నుంచి మనీ కట్ అయినా డబ్బులు రాకుండా ఓ మెసేజ్ తెలియజేస్తూ ఒక రిసీప్ట్ వస్తుంది. ఈ రిసీప్ట్ పై ట్రాన్జాక్షన్ నెంబర్, ఏటీఎం ఐడీ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ను కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులో 5 రోజుల్లో అకౌంట్లో డబ్బు జమ అవుతుంది. అయితే బ్యాంకులో జమ కాకుంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకు 6వ రోజు నుంచి ప్రతిరోజూ రూ. 100 చెల్లించాలి. ఇలా 10 రోజుల వరకు కూడా బ్యాంకులో డబ్బులు జమ కాకపోతే రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఈ విషయాన్ని బ్యాంకులకు తెలియజేసినా వారు పట్టించుకోకపోతే బ్యాంకు అంబుడ్స్ మెన్ కు కంప్లయింట్ ఇవ్వొచ్చు. ఎందుకంటే చాలా మంది అత్యవసరం కారణంగా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం వల్ల రాకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల అవసరాలకు డబ్బులు రాకపోవడానికి బ్యాంకులే కారణం. అందువల్ల ఈ ఫెనాల్టీని బ్యాంకులే చెల్లించాలని ఆర్బీఐ పేర్కొంది. అందువల్ల ఏటీఎంలో డబ్బుల రాకపోవడంతో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం ద్వారా లాభమే గానీ.. ఎలాంటి నష్టం ఉండదు.