Homeఆధ్యాత్మికంDhanteras 2024 : ఈ 5 రాశుల వారికి దంతేరాస్ కలిసి రానుంది.. వద్దన్నా డబ్బు..

Dhanteras 2024 : ఈ 5 రాశుల వారికి దంతేరాస్ కలిసి రానుంది.. వద్దన్నా డబ్బు..

Dhanteras 2024 : భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలతో నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ నుంచి పండగుల సీజన్ ప్రారంభం కావడంతో వరుసగా ఫెస్టివెల్ డేస్ వస్తుంటాయి. ఈ క్రమంలో దసరా తరువాత దీపావళి రానుంది. అయితే దీపావళికి రెండు రోజుల ముందు దంతేరాస్ వేడుకలు నిర్వహించుకుంటారు. వ్యాపారులు దంతేరాస్ రోజులు లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో ఈరోజును శుభదినంగా భావిస్తారు. అయితే దంతేరాస్ కారణంగా కొన్ని గ్రహాల్లో మార్పులు జరగనున్నాయి. ఈరోజున కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. దీంతో ఆయా రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు జరనున్నాయి. మరి ఏ రాశిపై దంతేరాస్ ప్రభావం పడనుందో చూద్దాం..

2024 ఏడాదితో అక్టోబర్ 31న దీపావళి పండుగ రానుంది. దీని కంటే రెండు రోజుల ముందే అంటే అక్టోబర్ 29న దంతేరాస్ వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా బుధుడు, శుక్ర గ్రహాలు ఒకే సంచారం చేయనున్నాయి. దీంతో మిథునం, తుల, సింహా రాశులతో సహా మొత్తం 5 రాశుల వారికి రాజయోగం కలగనుంది. ముఖ్యంగా ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు ధనలాభం ఎక్కువగా ఉంది. మరి 5 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉంటాయో చూద్దాం..

బుధుడు, శుక్రుడు కలయిక వల్ల మిథున రాశి వారికి కలిసి రానుంది. ఈ రాశి వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు గతంలో ఇన్వెస్ట్ మెంట్ చేసిన వాటికి లాభాలు వస్తాయి. అయితే ఉద్యోగులకు ఖర్చులు అదనంగా ఉంటాయి. కొందరు వాగ్వాదాలతో నిరాశ చెందుతారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి.

రెండు గ్రహాల కలయికతో సింహారాశి వారి జీవితాల్లో అనుకోని మార్పులు రానున్నాయి. ఈ రాశి ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కొన్ని రోజుల పాటు వరుసగా లాభాలు వస్తుంటాయి. ఆదాయాన్ని సమకూర్చడంలో విజయం సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

తులా రాశి వారికి దంతే రాస్ రోజు కలిసి రానుంది. ఈ రాశి వ్యాపారులకు అనుకోని ఆదాయం లభిస్తుంది. కొందరు ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకోవడంతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కటుంబ సభ్యులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

దంతేరాస్ రోజున వృశ్చిక రాశి వారికి మహర్దశ కలగనుంది.ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయమే వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శత్రువుల బెడత తక్కువవుతుంది. సంబంధాలు మెరుగుపడుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారు శుభవార్తలు వింటారు. కొత్త సంబంధాలు ఏర్పడుతాయి.

బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో సంచారం చేయనున్నందున కుంభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు పెరగనున్నాయి. తల్లిదండ్రుల సహకారంతో కొత్త పెట్టుబడులు పెడుతారు. కొందరు కాంట్రాక్టులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version