IAS Amrapali : తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ ఆమ్రపాలీకి డిమాండ్ నే.. ఏ పోస్ట్ ఇస్తున్నారంటే?

డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్‌లు ఏపీ కేడర్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే.. తాము తెలంగాణలో ఉంటామని ఐఏఎస్‌లు పెట్టుకున్న రెక్వెస్టును కూడా డీఓపీటీ తిరస్కరించింది. ఇచ్చిన సమయం ప్రకారం వెళ్లి ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశించింది. దీంతో డీఓపీటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం గడువు నేటితో ముగియనుంది.

Written By: Srinivas, Updated On : October 16, 2024 11:40 am

IAS Amrapali

Follow us on

IAS Amrapali :  ‘బంగారం ఎక్కడ ఉన్నా బంగారమే’ అన్నట్లు..పనితీరు మంచిగా ఉంటే ఎవరికైనా ఏ పోస్టులో నైనా అదే స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఐఏఎస్ ఆమ్రపాలి పనితీరుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేయగా.. ఏపీలోనూ ఆమెకు డిమాండే కనిపిస్తోంది. డీఓపీటీ ఆదేశాల నేపథ్యంలో ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని వీడి ఏపీకి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో వారు క్యాట్‌ను ఆశ్రయించినప్పటికీ ఉపశమనం లభించలేదు. దీంతో ఐఏఎస్‌ల అంశంలో ఇంకా ఉత్కంఠ వాతావరణం వీడడం లేదు. ఈ క్రమంలో హైకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధం అయ్యారు. హైకోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందా అనేది అందరిలోనూ టెన్షన్ కనిపిస్తోంది. చివరి తీర్పు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్‌లు ఏపీ కేడర్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే.. తాము తెలంగాణలో ఉంటామని ఐఏఎస్‌లు పెట్టుకున్న రెక్వెస్టును కూడా డీఓపీటీ తిరస్కరించింది. ఇచ్చిన సమయం ప్రకారం వెళ్లి ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశించింది. దీంతో డీఓపీటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం గడువు నేటితో ముగియనుంది. ఆ నలుగురు ఐఏఎస్‌లు కూడా ఈ రోజు ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే.. తమను తెలంగాణలోనే కొనసాగించాలంటూ ఐఏఎస్‌లు క్యాట్‌ను సైతం ఆశ్రయించారు. విచారించిన క్యాట్ వారు ఏపీకి వెళ్లాల్సిందేనని చెప్పింది. తదుపరి విచారణను నవంబర్‌కు వాయిదా వేసింది. అయితే.. క్యాట్ తీర్పుపై క్లారిటీ లేకపోవడంతో ఐఏఎస్‌లు మరింత సందిగ్ధంలో పడ్డారు.

డీఓపీటీ డెడ్‌లైన్ ముగియనుండడంతో ఏపీ ప్రభుత్వం ముందు రిపోర్టు చేసే ముందే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. తీర్పు ఎలా ఉంటుందోనని ముందే ఏపీ ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆమ్రపాలి సహా మిగితా ఐఏఎస్‌లు రిపోర్టు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ప్రధానంగా ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ ఐఏఎస్‌లు తెలంగాణలో ప్రధాన పోస్టుల్లో ఉన్నారు. దాంతో వారిని రిలీవ్ చేసేందుకు తెలంగాణ కూడా సంసిద్ధంగా లేదు. వారిని రిలీవ్ చేయకుండా ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఆమ్రపాలి ఏపీలో ప్రభుత్వం ముందు రిపోర్టు చేస్తే అక్కడి ప్రభుత్వం కూడా ప్రాధాన్యత కలిగిన పోస్టును ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎంఓ ఆఫీసులోనే మంచి పోస్టు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఆమ్రపాలి ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసిన అనుభవాన్ని వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆమ్రపాలి ఏపీకి వెళ్లకుండా తెలంగాణ స్టేట్ నుంచి రెక్విస్ట్ వెళ్తే ఈ సమస్యకు ఓ పరిష్కార లభించనుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర అవగాహనతో అధికారులను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఏపీ సర్కా్ర్ అంగీకరిస్తే ఆమ్రపాలి తెలంగాణలోనే పనిచేయనున్నారు. అయితే.. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల సంప్రదింపులు పూర్తయ్యాక క్లారిటీ రానుంది. మొత్తానికి హైకోర్టులో పిటిషన్ వేయనున్న క్రమంలో తీర్పుపై ఇటు ఐఏఎస్‌లతో పాటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది..