Defender Octa Variant
Defender Octa Variant:లగ్జరీ కార్ల విభాగంలో డిఫెండర్‌కు చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ పాపులర్ కారు హై-పెర్ఫార్మెన్స్ వేరియంట్ Octa భారతీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర అక్షరాలా రూ.2.59 కోట్లు. ఈ సరికొత్త వేరియంట్ ఆకట్టుకునే పర్ఫామెన్స్ తో పాటు కఠినమైన ఆఫ్-రోడ్ పరిస్థితులను సైతం తట్టుకునేలా రూపొందించారు. ఇది మట్టి రోడ్లలోనూ దూసుకుపోగలదు. సస్పెన్షన్‌తో సహా అనేక ఇతర అంశాలలో ఈ కారు స్టైలింగ్‌ను కూడా అప్‌డేట్ చేసింది కంపెనీ.
Also Read : ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 650కి.మీ.. కియా నుంచి నయా ఎలక్ట్రిక్ కార్
డిఫెండర్ 110 కాన్ఫిగరేషన్‌లో ఈ Octa వేరియంట్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో పవర్ ఫుల్ 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజన్‌ను అమర్చారు. ఇది మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్, ఇది 635 PS పవర్, 750 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లాంచ్ కంట్రోల్ మోడ్‌లో టార్క్ 800 Nm వరకు పెరుగుతుంది. ఇది ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ కారు, అంటే ఇది బుల్లెట్ లాగా వేగంగా దూసుకుపోయే కెపాసిటీని కలిగి ఉంటుంది. డిఫెండర్ Octa కేవలం 4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఈ కారు ఫ్రేమ్లో కూడా కంపెనీ మార్పులు చేసింది, ఇది మెరుగైన ఆఫ్-రోడ్ SUVగా రూపొందించడానికి సాయపడుతుంది.
డిఫెండర్ Octa స్టైలింగ్‌లో కూడా గణనీయమైన మార్పులు చేశారు. దీని స్టాన్స్ మరింత పెంచారు. వీల్ ఆర్చ్‌లు ముందు కంటే వెడల్పు చేశారు. దీని వలన దీని ఆకారం డైమండ్ లాగా కనిపిస్తుంది. ఈ కారులో ప్రత్యేకమైన టెర్రైన్ టైర్‌లను అమర్చారు. అలాగే, పెద్ద వీల్స్‌ను ఉపయోగించారు. ఈ టైర్లు, పెద్ద వీల్స్ కారణంగా ఈ కారు ఎక్కువ నీటిలో కూడా సులభంగా ప్రయాణించగలదు.
డిఫెండర్ Octa ఎత్తును 28 మిమీ పెంచారు. ఈ కారును 68 మిమీ వెడల్పు చేశారు. ఈ కారు బ్రేక్‌లు కూడా ముందు కంటే మెరుగుపరిచారు. డిఫెండర్ ఈ కొత్త వేరియంట్‌లో మెరుగైన ఆఫ్-రోడ్ డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ప్రత్యేకంగా Octa మోడ్‌ను అందించారు. ఈ కారు లోపల తేలికపాటి అప్హోల్‌స్ట్రీని ఉపయోగించారు. అలాగే, ఇందులో ప్రత్యేకమైన పర్ఫార్మెన్స్ సీట్లు అమర్చారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ Octa విడుదల లగ్జరీ SUV విభాగంలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని భావిస్తున్నారు. పవర్ ఫుల్ ఇంజన్, లేటెస్ట్ ఫీచర్లు, ఎట్రాక్టివ్ డిజైన్‌తో ఈ కారు ఖచ్చితంగా లగ్జరీ కార్ల ప్రేమికులను ఆకట్టుకుంటుంది.
Also Read : ఏప్రిల్ 2నుంచి ప్రతి వాహనంలో ప్రజల ప్రాణాలకు కాపాడే ఈ రెండు ఫీచర్స్ తప్పనిసరి