సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాహనదారులు బైక్ లేదా కారులో ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేయడం గమనార్హం. డీజిల్ రేటు కూడా అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయని నివేదికలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరిన […]

Written By: Navya, Updated On : June 23, 2021 8:59 pm
Follow us on

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాహనదారులు బైక్ లేదా కారులో ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేయడం గమనార్హం. డీజిల్ రేటు కూడా అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయని నివేదికలు వెలువడుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నా పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించాలని భావించడం లేదు. రానున్న కాలంలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరొచ్చనే అంచనాలు సైతం ఉన్నాయి. క్రూడ్ ధర 25 డాలర్లు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధర 12 నుంచి 14 రూపాయలు పెరిగే అవకాశం ఉంది.

పెట్రోల్, డీజిల్ దెబ్బకు ఇప్పటికే వాహనదారుల జేబుకు చిల్లు పడినట్లేనని భావించాలి. 2021లో ఇప్పటి వరకు చూస్తే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 50 శాతం పెరగగా బ్రెంట్ క్రూడ్ ధర 46 శాతం పైకి ఎగసిన సంగతి తెలిసిందే. గడిచిన రెండు సంవత్సరాలతో పోలిస్తే క్రూడ్ ధరలు ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ఉండటం గమనార్హం. 2021 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటివరకు 14 రూపాయలకు పైగా పెరిగాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతుండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.