మనలో చాలామంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనేక స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందుకోసం తల్లిదండ్రులు ఎంచుకునే పెట్టుబడి మార్గాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. కొంతమంది తల్లిదండ్రులు పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాను ఓపెన్ చేసినా వేర్వేరు కారణాల వల్ల ఆ ఖాతాను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. పిల్లలు పూర్తి ప్రయోజనాలను పొందాలంటే పీపీఎఫ్ ఖాతాను కొనసాగిస్తే మంచిది.
10 సంవత్సరాల పాప కొరకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ఓపెన్ చేస్తే 15 సంవత్సరాలకు 7 శాతం వడ్డీరేటు ప్రకారం 1,60,000 రూపాయలు వస్తుంది. ఖాతాను మరో 35 సంవత్సరాలు కొనసాగిస్తే ఏకంగా 27 లక్షల కంటే ఎక్కువమొత్తం నిధిని కూడబెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లేదా కూతురుకు 22 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో నెలకు 1,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్లు వచ్చేసరికి 23,72,635 రూపాయలు వస్తాయి.
తొలి ఉదాహరణతో పోలిస్తే రెండో ఉదాహరణలో పెట్టుబడులు రెట్టింపు అయిన సంగతి తెలిసిందే. అయితే సమకూర్చుకున్న మొత్తం మాత్రం తక్కువగా ఉంది. అందువల్ల నిపుణులు త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే మంచిదని చెబుతున్నారు. భారతీయులు మాత్రమే ఈ ఖాతాను తెరిచే అవకాశం ఉంటుంది. మైనర్ తరుపున ఒకరు మాత్రమే ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
మైనర్ కు 18 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు తల్లిదండ్రులే ఈ ఖాతాను నిర్వహించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా లక్షన్నర వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. తల్లి, తండ్రి ఇద్దరి పేర్లపై పీపీఎఫ్ ఖాతాలు ఉన్నా ఈ మొత్తం మాత్రమే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.