https://oktelugu.com/

అమ్మకాల్లో దూసుకుపోతున్న క్రెటా.. ఏప్రిల్ ఒక్కనెలలోనే..

గా క్రెటా అమ్మకాల్లో దూసుకుపోతుంది. 2024 ఏప్రిల్ లో దేశ వ్యాప్తంగా 15,447 యూనిట్లు విక్రయాలు జరుపుకుంది. గత నెలలో మారుతి గ్రాండ్ విటారా 7,651 కార్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 17, 2024 10:24 am
    Hyundai Creta facelift

    Hyundai Creta facelift

    Follow us on

    నేటి కాలంలో చాలా మంది ఎస్ యూవీ కార్లను కోరుకుంటున్నారు. అయితే ఇది సాధ్యం కాని తరుణంలో కాంపాక్ట్ ఎస్ యూవీని కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా కాంపాక్ట్ ఎస్ యూవీని మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కంపెనీ నుంచి రిలీజ్ అయినా Creta బెస్ట్ కాంపాక్ట్ ఎస్ యూవీగా పేరు తెచ్చుకుంది. ఈ కారు ఫీచర్స్ ఆకట్టుకోవడంతో ఎక్కువగా అమ్మకాలు జరుపుకుంటోంది. మారుతి నుంచి రిలీజ్ అయిన గ్రాండ్ విటారాకు గట్టి పోటీనిస్తున్న ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం..

    భారత మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ దూసుకెళ్తోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన చాలా కార్లు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. తాజాగా కాంపాక్ట్ ఎస్ యూవీ కారు విపరీతంగా ఆకట్టుకుంటోంది. హ్యుందాయ్ క్రెటా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 113 బీహెచ్ పీ పవర్ తో పాటు 114 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరో ఇంజిన్ 1.5 లీటర్ టర్బో ఇంజిన్ తో పాటు 158 బీహెచ్ పీ పవర్ 253 ఎన్ ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

    హ్యుందాయ్ క్రెటా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిసన్ తో పాటు టర్బో ఇంజిన్ 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచే్తుంది. అయితే పట్టణాలు, నగరాల్లో ని వారుక్రెటా కొనుగోలు చేయాలనుకుంటే నేచురల్ ఆస్పిరేటేడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగిన కారును కొనుగోలుచేయొచ్చు. అయితే హైవేలపై వెళ్లే వారు టర్బో ఇంజిన్ ను కొనుగోలు చేయొచ్చు. అలాగే ఇందులో ఎన్ లైన్ వంటి ప్రత్యేకమైన లైన ప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    ఇదే కాకుండా లో బడ్జెట్ లో కారు కొనాలనుకునేవారు క్రెటా డ్రైవింగ్ మంచి అనుభవం పొందుతుంది. అలాగే ఇందులో సేప్టీ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 360 డిగ్రీ కెమెరా, అడాస్ లెవల్ 2 వంటి ఫీచర్లు అమర్చారు. మిగతా కార్లలోని స్టాండర్ట్ డిజైన్ వంటివి ఆకర్షించనున్నాయి. ఇదిలా ఉండగా క్రెటా అమ్మకాల్లో దూసుకుపోతుంది. 2024 ఏప్రిల్ లో దేశ వ్యాప్తంగా 15,447 యూనిట్లు విక్రయాలు జరుపుకుంది. గత నెలలో మారుతి గ్రాండ్ విటారా 7,651 కార్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి.