https://oktelugu.com/

Credit Card Tips : క్రెడిట్ కార్డు బిల్లులో ఉండే ‘మినిమం పేమెంట్స్’ ను చెల్లిస్తే భారీగా నష్టం..ఎలాగో తెలుసుకోండి..

కానీ ఇన్ టైంలో బిల్లులు చెల్లించలేకపోతారు. అయితే ఇదే సమయంలో బ్యాంకులు మినిమం అమౌంట్ పే చేయొచ్చు అని చెబుతాయి. కానీ దీనిని చెల్లిస్తే చాలా నష్టపోతారు. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Written By:
  • Srinivas
  • , Updated On : February 14, 2024 / 12:48 PM IST

    Credit Card Minimum Payments

    Follow us on

    Credit Card Tips :  నేటి కాలంలో సామాన్యుల వద్ద కూడా క్రెడిట్ కార్డు ఉంటోంది. బ్యాంకు లావాదేవీల ఆధారంగా కొన్ని సంస్థలు తక్కువ లిమిట్ తో క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. చేతిలో డబ్బు లేని సమయంలో క్రెడిట్ కార్డు అవసరాలను తీరుస్తుంది. కానీ సమయానికి దీని బిల్లులు చెల్లంచకపోతే వడ్డీ భారం అధికంగా ఉంటుంది. కొందరు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేస్తుంటారు. కానీ ఇన్ టైంలో బిల్లులు చెల్లించలేకపోతారు. అయితే ఇదే సమయంలో బ్యాంకులు మినిమం అమౌంట్ పే చేయొచ్చు అని చెబుతాయి. కానీ దీనిని చెల్లిస్తే చాలా నష్టపోతారు. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

    కనీసం 45 రోజుల వ్యవధితో క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అవసరానికి ఇతరులను డబ్బు అడగకుండా క్రెడిట్ కార్డును వాడుకోవచ్చు. బ్యాంకు ట్రాన్జాక్షన్, సిబిల్ స్కోర్ ఆధారంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తూ లిమిట్ మొత్తాన్ని ఇస్తారు. సక్రమంగా బిల్లులు చెల్లింపులు చేస్తే లిమిట్ పెంచుతారు. క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులను మాత్రమే కాకుండా రుణ సాయం కూడా తీసుకోవచ్చు. అయితే వస్తువులను కొనుగోలు చేస్తే 45 రోజుల వరకు ఎలాంటి వడ్డీ విధించరు. రుణాలకు మాత్రం మినిమం వడ్డీ విధిస్తారు. ఇక వస్తువులను కొనుగోలు చేసిన మొత్తాన్ని గడువులోగా చెల్లంచకపోతే 36 శాతానికి పైగా వడ్డీ విధిస్తారు.

    క్రెడిట్ కార్డు బిల్లు వచ్చినప్పుడు అందులో మినిమం అమౌంట్ పే చేయొచ్చు అనే ఆప్షన్ ఉంటుంది. చాలా మంది ఇలా తక్కువ మొత్తం చెల్లంచడం ద్వారా ఉపశమనం కలుగుతుందని అనుకుంటారు. కానీ ఇది చెల్లించడం ద్వారా లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒక వేల మినిమం అమౌంట్ ను చెల్లిస్తే మిగతా మొత్తానికి బ్యాంకు వారు కనీసం 14 శాతం వరకు వడ్డీని కచ్చితంగా విధిస్తారు. ఇది నేరుగా చెప్పకపోయినా వివిధ రకాలుగా ఛార్జీలు విధిస్తారు.

    అయితే అత్యవసరం సమయంలో ఒకటి, రెండు నెలల వరకు ఇలా చెల్లించుకుంటే తక్కువగా నష్టపోతారు. కానీ ఇదే పనిగా మినిమం అమౌంట్ ను చెల్లిస్తే మిగతా మొత్తానికి వడ్డీ పై వడ్డీ విధించడంతో భారంగా మారుతుంది. అలా జమ అయిన ఆ మొత్తం జీవితాంతం చెల్లించినా తీరదు. అందువల్ల క్రెడిట్ కార్డుపై బిల్లు ఎంత ఉంటే అంత చెల్లించే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లంచడం ద్వారా ఎలాంటి భారం ఉండదు. లేకుంటే బ్యాంకు వారు దీనిపై 36 శాతం వరకు వడ్డీని విధిస్తారు. అయినా చెల్లించకపోతే ఈ వడ్డీకి అదనంగా మరో వడ్డీని వేస్తారు. అందువల్ల క్రెడిట్ కార్డు వాడేవారు ఇలాంటి విషయాలపై అవగాహన ఉండాలి.