Best Sale Car: కార్లు కొనాలనుకునేవారు SUV కోసం ఎదురుచూస్తున్నారు. మార్కట్లోకి ఏ ఎస్ యూవీ వచ్చినా వాటికి ఆదరణ పెరుగుతోంది. ఈ తరుణంలో హ్యుందాయ్ కంపెనీ గత జనవరిలో Creta అప్డేట్ ఎస్ యూవీని మార్కెట్లోకి వచ్చింది. ఇది వచ్చిన నాలుగు నెలల్లో అమ్మకాల్లో వృద్ధి సాధించింది. 2024 ఏడాదిలో ఇప్పటి వరకు ఉన్న టాప్ మోడళ్లలో క్రెటా రెండో స్థానంలో ఉండడం విశేషం. ఈ కారు ఫీచర్స్ తో పాటు ధర కూడా అందుబాటులో ఉండడంతో వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు ఎస్ యూవీ లకు డిమాండ్ ఉండడంతో క్రెటా అమ్మకాల్లో దూసుకుపోతుంది.
2024 ఏడాది ఇప్పటి వరకు జరిగిన SUV కార్ల అమ్మకాల్లో టాప్ 10 లో టాటా పంచ్ 17,547 విక్రయాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత హ్యుందాయ్ కి చెందిన క్రెటా 16,458 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తరువాత బ్రెజ్జా, నెక్సాన్, ఫ్రాంక్, స్కార్పియోలు నిలిచాయి. గత మార్చిలో క్రెటాను 14, 026 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2024 అప్డేట్ చేసిన క్రెటాను మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీంతో ఈసారి 17 శాతం వృద్ధితో 16,458 మంది కొనుగోలు చేశారు. క్రెటాను ఫిబ్రవరిలో 7వ స్థానంలో ఉండగా.. మార్చిలో ఏకంగా రెండో స్థానానికి రావడం విశేషం.
హ్యుందాయ్ క్రెటాకు సంబంధించిన మొత్తం 28 వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడలో ఫీచర్ విషయానికొస్తే.. ఇందులో ADAS సూట్ ఆకర్షిస్తుంది. ఎల్ ఈడీ, డీఆర్ఎల్ తో పాటు కనెక్ట్ చేయబడిన టెయిల్ లైట్ ఉన్నాయి. సేప్టీ విషయంలో క్రెటా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో లేటేస్ట్ సేప్టీ ఫీచర్స్ ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ 4 సిలిండర్ తో పాటు 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కలిగిన ఇందులో 5గురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
క్రెటా ధర రూ.11 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ రూ.20.15 లక్షల వరకు ఉంది. గత మార్చిలో N వేరియంట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీనిని రూ.16.82 లక్షల నుంచి మొదలై రూ.20.45 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఎన్ వేరియంట్ కు వినియోగదారులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇందులో ఉండే ఫీచర్స్ బాగా ఆకట్టుకోవడంతో ఈ కారు కోసం ఎగబడుతున్నారు.