CNG Version
CNG Version : కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగదారులు పెరిగిపోతున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది కార్లను కొనేందుకు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. పెట్రోల్ కంటే తక్కువ ధరలో ప్రయాణించడానికి కార్లలో CNG కిట్ లను అమరుస్తున్నారు. ఇప్పటికే మారుతి వంటి అగ్ర కంపెనీలు తమ పెట్రోల్ కార్లలో ఈ కిట్లను అమర్చారు. మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాటలోకి వస్తున్నాయి. అయితే ఓ కంపెనీ మాత్రం ఏకంగా CNG కొత్త కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది. సీఎన్ జీ కార్లు మైలేజ్ తో పాటు అతి తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని అంటున్నారు. అయితే సీఎన్ జీ వెర్షన్ లో వచ్చే కార్లు ఏదో తెలుసుకోవాలని ఉందా… అయితే ఈ స్టోరీ మీకోసం..
Also Read : పెట్రోల్ కారు నుంచి CNG కారుగా మార్చుకోవాలా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
దేశంలో NISSAN కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన చాలా కార్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే కొత్తగా CNG కారును తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఈ మోడల్ SUV వేరియంట్ లో రాబోతుంది. SUV వేరియంట్ లో అతి తక్కువ ఖర్చుతో సుదూరం ప్రయాణించే వారికి Nissan Magnite బెస్ట్ ఆఫ్షన్ అని అంటున్నారు. ఈ కారు మైలేజ్ విషయంలోనే కాకుండా.. ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితె..
ఇందులో 1.0 లీటర్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. అలాగే ఇందులో CNG కిట్ ను కూడా అమర్చారు. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను అమర్చారు. అయితే ఆటోమేటిక్ గేర్ బాక్స్ పై నిర్ణయం తీసుకోనుననారు. ఈ ఇంజిన్ కిట్ పై కిలో సీఎన్ జీ తో 22 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని అంటున్నారు. ఈ కారు మైలేజ్ ఎక్కువగా ఇవ్వడంతో పాటు మెయింటనెన్స్ కూడా తక్కువగానే ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ కారు సేప్టీలో కూడా బెస్ట్ అని అంటున్నారు.
ఇందులో భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. అలాగే ఎత్తైన రహదారులపై వెళ్లే సమయంలో హిల్ స్టార్ట్ అసిస్ట్, చైల్డ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ స్టీరింగ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అయితే నిస్సాన్ మాగ్నైట్ కారులో అమర్చిన సీఎన్ జీ కిట్ కోసం ఒక సంవత్సరం గ్యారంటీ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పెట్రోల్, డీజిల్ కార్లు ఉన్నవారు వాటిలో ఈ కిట్ ను అమర్చుకోవచ్చని తెలుపుతున్నారు. వీటి ధర రూ.75,000 నుంచి రూ. 79,500 వరకు విక్రయించనున్నారు. అయితే ఈ ధరపై క్లారిటీ లేదు. కానీ డీలర్లను సంప్రదిస్తే అసలు ధర ఎంతో తెలుసుకోవచ్చు. కాగా ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ కారు ధర రూ.11.70 లక్షల వరకు విక్రయిస్తున్నారు. కొత్తగా వచ్చే నిస్సాన్ మాగ్నైట్ సీఎన్ జీ కారు ధర రూ. 12 లక్షలకు పైగానే ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు.
Also Read : CNG కార్ల వైపే వినియోగదారుల మొగ్గు.. బెస్ట్ మోడల్స్ ఏవి? వాటి ధర ఎంత?