https://oktelugu.com/

SRH Vs LSG: “300” టార్గెట్.. హైదరాబాద్ కొంప ముంచిందా?

SRH Vs LSG హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు. 300 పరుగులకు అడ్డే లేదు. ఐపీఎల్ లో ఈసారి కమిన్స్ జట్టును అడ్డుకునే ప్రత్యర్థి జట్టు లేదు.. ఇలానే పెరిగిపోయాయి అంచనాలు.. ఇలానే సాగిపోయాయి ఉపమానాలు..

Written By: , Updated On : March 28, 2025 / 01:10 PM IST
SRH Vs LSG

SRH Vs LSG

Follow us on

SRH Vs LSG: లక్నో జట్టు గట్టి షాక్ ఇచ్చేసరికి హైదరాబాద్ జట్టులో ఉన్న లోపాలు ఏమిటో వెలుగులోకి రాలేదు .. ఒకరిద్దరు బ్యాటర్ల మీద జట్టు ఆధారపడితే ఎలాంటి ఫలితం వస్తుందో హైదరాబాద్ జట్టుతో గురువారం నాటి మ్యాచ్ వాస్తవంలో చూపించింది. అభిషేక్ శర్మ (6) అవుట్ కావడం, తొలి మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్(0) గోల్డెన్ డక్ అవుట్ కావడంతో హెడ్(47), నితీష్ కుమార్ రెడ్డి (32), క్లాసెన్(26) మాత్రమే నిలబడటంతో హైదరాబాద్ జట్టు ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. వాస్తవానికి మిడిల్ ఆర్డర్ కనుక ప్రతిఘటిస్తే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. కానీ ఓపెనర్లలో భీకరమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ త్వరగా అవుట్ కావడం.. వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన ఇషాన్ కిషన్(0) మరుసటి బంతికి అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు ఒక్కసారిగా షాక్ కు గురైంది.. హెడ్ కూడా వేగంగా ఆడే క్రమంలో అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు స్కోర్ మరింత మందగించింది. నితీష్ కుమార్ రెడ్డి కీలక సమయంలో అవుట్ కావడం.. క్లాసెన్ దురదృష్టవశాత్తు అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు కోలుకోలేకపోయింది.

Also Read: “300” కల.. అన్ సోల్డ్ బౌలర్ వల్ల కల్ల! లక్నో టార్గెట్ ఎంతంటే?!

అంచనాలు కొంప ముంచాయి

తొలి మ్యాచ్లో భారీగా పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు.. రెండో మ్యాచ్లో 300 స్కోర్ మార్క్ చేరుకుంటుందని అందరూ అంచనాలు వేసుకున్నారు. మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. అయితే వాస్తవ రూపంలో ఇందుకు విరుద్ధమైన ఫలితం వచ్చింది. ఒత్తిడిలో.. విపరీతమైన అంచనాలున్న తరుణంలో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. ఆటగాళ్లు తెలియని ఒత్తిడిని ఎదుర్కొని ఇబ్బంది పడ్డారు. ఫలితంగా లక్నో జట్టు ఎదుట చేతులెత్తేశారు. వాస్తవానికి సొంత మైదానంలో హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు. కానీ ఊహించని అంచనాలు.. పెరిగిపోయిన ఒత్తిడి ఆ జట్టును ఓటమిపాలు చేశాయి.. ఇదే విషయాన్ని హైదరాబాద్ జట్టు కెప్టెన్ మ్యాచ్ ఓటమి తర్వాత విలేకరుల సమావేశంలో అంతర్గతంగా వ్యాఖ్యానించాడు. ఈ ఓటమి తమకి ఎన్నో పాఠాలు నేర్పిందని.. దీనినుంచి తాము నేర్చుకున్నామని.. తర్వాత మ్యాచ్లో బౌన్స్ బ్యాక్ అవుతామని వ్యాఖ్యానించాడు.. ఇక ఈ మ్యాచ్లో తీవ్ర ఒత్తిడి మధ్య హైదరాబాద్ జట్టు 190 పరుగుల వద్దే ఆగిపోవడంతో లక్నో జట్టుకు చేజింగ్ పై స్పష్టత వచ్చింది.. మార్క్రం అవుట్ అయినప్పటికీ.. మార్ష్, పూరన్ దంచి కొట్టడంతో 191 పరుగుల లక్ష్యం కాస్త కరిగిపోయింది. పూరన్, మార్ష్ వేగంగా పరుగులు చేయడంతో హైదరాబాద్ జట్టు బౌలర్లపై ఒత్తిడి పెరిగిపోయింది.. ఒత్తిడిలో ఆ జట్టు బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. అవి లక్నో జట్టు బ్యాటర్లకు సానుకూలంగా మారాయి. తమకు అంది వచ్చిన అవకాశాలను లక్నో బ్యాటర్లు వినియోగించుకున్నారు.. రిషబ్ పంత్ విఫలమైనప్పటికీ.. అప్పటికే హైదరాబాద్ జట్టు ఓటమి ఖరారు కావడంతో.. లక్నో జట్టు పెద్దగా ప్రయోగాలు చేయకుండానే విజయం సాధించింది.