CNG Cars : CNG కార్ల వైపే వినియోగదారుల మొగ్గు.. బెస్ట్ మోడల్స్ ఏవి? వాటి ధర ఎంత?

CNG కార్ల వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఈ కారు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే అనుకున్న సమయాల్లో, అనుకున్న ప్రాంతాల్లో సీఎన్ జీ అందుబాటులో ఉండదు. అందువల్ల పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్ ఎంచుకుంటే రెండు విధాలుగా ఉపయోగం ఉంటుంది.

Written By: Srinivas, Updated On : July 17, 2024 1:22 pm
Follow us on

CNG Cars : కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగదారుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు డీజిల్ కార్ల కొనుగోలు చేసిన వారు.. ఆ తరువాత పెట్రోల్ కార్ల కోసం ఎగబడ్డారు. అయితే ఇప్పుడు ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కారు ఉన్న వారు తమ ఇంధన కోసం జేబు గుళ్ల అవుతోంది. మరోవైపు పెట్రోల్ వాహనాల వల్ల వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు సీఎన్ జీ కార్ల పై మోజు పెంచుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని కార్లు పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ ను కలిగి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ కొన్ని మోడళ్లు మాత్రం సీఎన్ జీ విషయంలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఆ కార్లు ఏవో చూద్దాం..

పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా సీఎన్ జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. దీంతో ఇప్పటికే చాలా కంపెనీలు ఈవీ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే ఈవీల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడు ఇవి మార్కెట్లోకి వస్తుండడంతో ధరలు అప్పుడే తగ్గే అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎన్ జీ కార్లవైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు.

CNG కార్ల వల్ల చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు ఈ కారు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే అనుకున్న సమయాల్లో, అనుకున్న ప్రాంతాల్లో సీఎన్ జీ అందుబాటులో ఉండదు. అందువల్ల పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్ ఎంచుకుంటే రెండు విధాలుగా ఉపయోగం ఉంటుంది. మరోవైపు సీఎన్ జీ వేరయింట్ లో మైలేజ్ ఎక్కువగా పొందవచ్చు. నిత్యం ప్రయాణాలు చేసేవారికి ఇది సౌకర్యమనే చెప్పవచ్చు.

దేశంలో CNG కార్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రముఖమైనవి గురించి తెలుసుకుందాం..

మారుతి కంపెనీనీ నుంచి పెట్రోల్, సీఎన్ జీ కార్లు ఎన్నో వచ్చాయి. వీటిలో వ్యాగన్ ఆర్ నెంబర్ వన్ గా చెప్పుకోవచ్చు. ఈ మోడల్ ఎక్కువగా సేల్ కావడానికి సీఎన్ జీ ఆప్షన్ అని కొందరు వినియోగదారులు అంటున్నారు. వ్యాగన్ ఆర్ లో 1.2 లీటర్ పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఉన్నాయి. సీఎన్ జీ ద్వారా ఈ కారు 34.04 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.6.44 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇందులో రెండు ఎయిర్ బ్యాగ్స్ సేప్టీని ఇవ్వనున్నాయి.

మారుతి కంపెనీకి చెందిన మరో కారు ఆల్టో కే 10 బెస్ట్ సీఎన్ జీ కారుగా ప్రసిద్ధి పొందింది. ఇది చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ మైలేజ్ విషయంలో ది బెస్ట్ అనుకోవచ్చు. సీఎన్ జీ వేరియంట్ లో ఈ కారు 33 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో పొందవచ్చు. అంతేకాకుండా ఈ కారుపై డిస్కౌంట్లు కూడా లభిస్తాయి.

హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ 10 నియోస్ సీఎన్ జీ వెర్షన్ లో అందుబాటులో ఉంది. దీనిని రూ.7.22 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది సీఎన్ జీ వెర్షన్ లో 68 బీహెచ్ పీ పవర్, 95 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కిలో సీఎన్ జీకి ఇది 25.61 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

టాటా కంపెనీకి చెందిన టిగోర్ సైతం బెస్ట్ సీఎన్ జీ కారుగా పేర్కొంటున్నారు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ వెర్సన్ ను కూడా పొందుతుంది. ఈ వేరియంట్ లో 84 బీహెచ్ పీ పవర్ తో పాటు 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.8.29 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది కిలో సీఎన్ జీకి 26.47 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.