Summer : వేసవిలో వాతావరణం వేడెక్కుతుంది. దీంతో మానవుల శరీరాలు కూడా ఉష్ణోగ్రతతో నిండిపోతాయి. కొందరిలో అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల వేసవిలో మరింత ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి వారి శరీరం తొందరగా డీహైడ్రేషన్కు గురవుతూ ఉంటుంది. వేరే కాకుండా ఇతరులు సైతం ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్కు గురవుతూ ఉంటారు. అయితే కొన్ని ఆరోగ్య పద్ధతులు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా ఇలా చేయాలని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
కొంతమంది ఎక్కువసేపు ఎండలో పనిచేసే వారు ఉంటారు. ఇలాంటివారు ఎండలోకి వెళ్లే ముందు కచ్చితంగా నీటిని తీసుకోవాలని అంటున్నారు. ఎండలో పనిచేయాలని అనుకునేవారు ముందుగానే కనీసం లీటర్ నీటిని తీసుకొని బయటకు వెళ్లాలి. ఆ తర్వాత దాహం వేయకుండా నీటిని తాగుతూ ఉండాలి. ఇలా తరచూ నీటిని తాగడం వల్ల శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవాలి. దీంతో ఎండలో ఎంతసేపు ఉన్నా.. శరీరం డిహైడ్రేషన్కు గురికాకుండా ఉంటుంది.
Also Read : వేసవిలో మీ కారును జాగ్రత్తగా చూసుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి
ఎండలో పనిచేసేవారు లేదా ఇతరులు కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ లో రసాయనాలు కలవడం వల్ల వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి శాతాన్ని బయటకు పంపివేస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల దాహం వేయకుండా ఉంటుంది. దీంతో నీరు తాగడం మానేస్తారు. అలా శరీరంలోని నీరు తగ్గిపోతుంది. అందువల్ల కూల్డ్రింక్స్ బదులు ఏవైనా జ్యూస్లు తీసుకోవడం మంచిది. వీలు కాకపోతే నీరును మాత్రమే తీసుకుంటూ ఉండాలి.
వేసవిలో సాధారణ ఆహారంతోపాటు నీటి కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి. వీటిలో పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటివి తీసుకుంటూ ఉండాలి. ఇవి తినడం వల్ల శరీరంలో నీటిని నిల్వ చేసిన వారవుతారు. దీంతో శరీరం తొందరగా డిహైడ్రేటుకు గురికాకుండా ఉంటుంది. అయితే కొందరు టేస్టీ కోసం ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి తొందరగా బాడిలోని మీరు బయటకు పోతుంది. ఈ ప్రాసెస్ ఆహారం తిన్న తర్వాత నీటిని తాగిన ఎలాంటి ఫలితం ఉండదు. అందువల్ల వేసవిలో ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి.
సాధ్యమైనంతవరకు వేసవిలో ఎండవేడికి బయటకు వెళ్లకుండా ప్రయత్నించాలి. ఒకవేళ తప్పనిసరిగా అనిపిస్తే ఎండ వేడి నుంచి రక్షణ పొందేందుకు కొన్ని వస్తువులు వాడుతూ ఉండాలి. వీటిలో టోపీ, కర్చీఫ్, టవల్ లాంటివి ధరిస్తూ ఉండాలి. అలాగే ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నీరు తాగద్దు. కాసేపు చల్లబడిన తర్వాత వీటిని తీసుకోవాలి. ఇలా ఎండలో నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత నీటిని తీసుకోవడం వల్ల శరీరం అదుపుతప్పుతుంది. దీంతో వాంతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మొత్తంగా వేసవిలో శరీరం డిహైడ్రేషన్కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
Also Read : ఏపీలో దంచి కొడుతున్న ఎండలు.. ఆ జిల్లాల్లో తీవ్రతరం!