BYD Sales : కార్లు కొనాలని అనుకున్న వారిలో హ్యాచ్ బ్యాక్, ఎస్ యూవీలు మాత్రమే కాకుండా ప్రీమియం వెహికల్స్ కోసం ఎదరుచూసేవారు ఉంటారు. ఈ నేపథ్యంలో బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లకు డిమాండ్ ఉంటుంది. భారత్ లోకార్ల మార్కెట్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ దేశీయ కార్లు మాత్రమే కాకుండా విదేశాలకు చెందిన లగ్జరీ కార్లు విక్రయాలు అవుతున్నాయి. ఒకప్పుడు ప్రీమియం కార్ల కావాలనుకునేవారు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. కానీ ఇప్పుడు భారత్ లోనే లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా వంటి కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను భారత మార్కెట్లో విక్రయాలు జరుపుతోంది. అయితే చైనాకు చెందిన ఓ కంపెనీ ఇప్పుడు అమ్మకాల్లో దూసుకుపోతుంది. తాజాగా ఈ కంపెనీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఆ కంపెనీ కార్ల అమ్మకాలు చూసి ఆటోమోబైల్ రంగంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆకంపెనీ ఏది? దాని సేల్స్ ఎలా ఉన్నాయి?
చైనాకు చెందిన BYD (Build Your Dreams) అనే కంపెనీ గురించి కారు వాడేవారికి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ కంపెనీ దేశీయంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తగా కొన్ని దేశాలకు తమ ఉత్పత్తులను తీసుకెళ్తోంది. ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే ఈ కంపెనీ తాజాగా తన సేల్స్ డేటాను బయటపెట్టింది. ఆ కంపెనీ తెలిపిన ప్రకారం.. నెలవారీ అమ్మకాల్లో రికార్డు సృష్టించాయి.వీటలో 1,65, 956 బ్యాటరీ కార్లు, 2, 52,647 ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు ఉన్నాయి. ఇలా మొత్తంగా 4,17, 603 యూనిట్లు పూర్తి చేసింది. 2023 సెప్టెంబర్ తో పోలిస్తే 2024లో ఈ కంపెనీ 4 లక్షల అమ్మకాలు చేసుకొని 46 శాతం వృద్ధిని సాధించింది. ఇందులో విదేశాల్లో 33 వేల యూనిట్లు సేల్స్ చేసింది.
2024 ఏడాదిలో ఇప్పటి వరకు ఈ కంపెనీ 2.75 మిలియన్ కార్లను విక్రయించినట్లు మోర్గాన్ స్టాన్లీ అనే ఆటోమోబైల్ విశ్లేషకులు తెలిపారు. ఏడాది సెప్టెంబర్ లో బీవైడీ కంపెీన 3.6 మిలియన్ల లక్ష్యాన్ని పెంచినట్లు పేర్కొన్నారు. కానీ ఆ స్థాయికి చేరుకోకున్నా.. అమ్మకాలు మాత్రం జోరందుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించింది. ఇలామొత్తంగా 20 వేల యువాన్ల వరకు తగ్గింపును ప్రకటించింది.
భారత్ లో బీవైడీ కార్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. అక్టోబర్ లో బీవైడీ నుంచి కొత్త మోడల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని బావో 5గా పేర్కొంటున్నారు. ఇది ఎలక్ట్రిక్ కారు లేదా హైబ్రిడ్ అయి ఉండొచ్చని అంటున్నారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు పండుగ సేల్స్ ఉన్నందున ఈ మధ్యలో కొత్త మోడల్ ను లాంచ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఇది పూర్తిగా ఎస్ యూవీ లేదా ల్యాండ్ రోవర్ డిఫెండర్, ఫోర్డ్ బ్రోంకో ను పోలి ఉంటుంది. దీనిని ఇప్పటికే బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో లో ప్రదర్శించారు. ఇందులో 31.8 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది.