https://oktelugu.com/

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..?

మాంసాహార ప్రియులలో చాలామంది వారానికి ఒకటి లేదా రెండుసార్లు చికెన్, మటన్ తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే దేశంలో గత నెల తొలి వారంలో విజృంభించిన బర్డ్ ఫ్లూ వల్ల చికెన్, మటన్ విక్రయాలు తగ్గడంతో పాటు చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కడా నమోదు కావడం లేదు. అయినప్పటికీ చికెన్ ధరలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. Also Read: ఎల్ఐసీ సూపర్ స్కీమ్.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 4, 2021 / 10:42 AM IST
    Follow us on

    మాంసాహార ప్రియులలో చాలామంది వారానికి ఒకటి లేదా రెండుసార్లు చికెన్, మటన్ తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే దేశంలో గత నెల తొలి వారంలో విజృంభించిన బర్డ్ ఫ్లూ వల్ల చికెన్, మటన్ విక్రయాలు తగ్గడంతో పాటు చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కడా నమోదు కావడం లేదు. అయినప్పటికీ చికెన్ ధరలు మాత్రం తక్కువగానే ఉన్నాయి.

    Also Read: ఎల్ఐసీ సూపర్ స్కీమ్.. నెలకు రూ.14 వేలు పెన్షన్ పొందే ఛాన్స్..?

    ఘాజిపూర్ చికెన్ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద చికెన్ మార్కెట్ అనే సంగతి తెలిసిందే. అక్కడ కిలో కోడి ధర 35 రూపాయలుగా ఉండటం గమనార్హం. కేజీ చికెన్ ధర మాత్రం అక్కడ 90 రూపాయలుగా ఉన్నట్టు తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ భయం తగ్గినా ప్రజలలో చాలామంది చికెన్, గుడ్లకు దూరంగా ఉండటం వల్లే చికెన్ ధరలు భారీగా పడిపోయాయని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణంగా ఉండే చికెన్ రేట్లతో పోలిస్తే చికెన్ రేట్లు తక్కువగానే ఉన్నాయి.

    Also Read: భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ..?

    కిలో కోడి 70 రూపాయల నుంచి 90 రూపాయలు పలుకుతుండగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పలుకుతోంది. చికెన్, గుడ్ల ధరలు తక్కువగా ఉండటం వల్ల నష్టాలు వస్తున్నాయని ఫౌల్ట్రీ ఫామ్ రైతులు అభిప్రాయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ పోయినా ప్రజల్లో ఉన్న భయాందోళన తమకు శాపంగా మారిందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము

    గతంలో కరోనా విజృంభించిన సమయంలో కూడా చికెన్ ధరలు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించడంతో మాంసం విక్రయాలు పుంజుకున్నాయి.