https://oktelugu.com/

విశేషాధికారాల నిమ్మగడ్డ.. ఏం చేయబోతున్నారు..?

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏపీలో పంచాయితీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎస్‌ఈసీ వర్సెస్‌ ప్రభుత్వం అన్నట్లుగా యుద్ధం నడుస్తూనే ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డకు ఉన్న సర్వాధికారాలను కొంతమేరకైనా అడ్డుకునేందుకు వైసీపీ సర్కార్‌‌ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాలు కాస్త రోజురోజుకూ జటిలంగా మారుతోంది. Also Read: అపాయింట్‌మెంట్‌ ఇచ్చినంత మాత్రాన కలుపుకున్నట్లేనా..? అయితే.. ఎన్నికల హింస మాత్రం ఆగడం లేదు. దీంతో నిమ్మగడ్డ తాజాగా చేసిన ఓ ప్రకటన అధికార […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 4, 2021 / 10:54 AM IST
    Follow us on


    గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏపీలో పంచాయితీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎస్‌ఈసీ వర్సెస్‌ ప్రభుత్వం అన్నట్లుగా యుద్ధం నడుస్తూనే ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డకు ఉన్న సర్వాధికారాలను కొంతమేరకైనా అడ్డుకునేందుకు వైసీపీ సర్కార్‌‌ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాలు కాస్త రోజురోజుకూ జటిలంగా మారుతోంది.

    Also Read: అపాయింట్‌మెంట్‌ ఇచ్చినంత మాత్రాన కలుపుకున్నట్లేనా..?

    అయితే.. ఎన్నికల హింస మాత్రం ఆగడం లేదు. దీంతో నిమ్మగడ్డ తాజాగా చేసిన ఓ ప్రకటన అధికార పార్టీలో కలవరం పుట్టించేలా ఉంది. అధికారుల అండతో ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకున్నా ఫలితం ఉండబోదనే చర్చ అధికార పార్టీలో మొదలైంది. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరు రెండోదశ నామినేషన్ల వరకూ చేరింది. ఒక్కో దశ ఎన్నికలు గడుస్తున్న కొద్దీ అధికార వైసీపీ పట్టు బిగేందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఎన్నికల్లో హింస కూడా పెరుగుతోంది. నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులను అడ్డుకోవడం, అధికారుల తీరుపై విమర్శలు, ఎస్‌ఈసీ జోక్యం ఇలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఎన్నికలను అక్రమాలు లేకుండా ముగించడం అధికారులకు సైతం సవాల్‌గా మారుతోంది.

    పంచాయతీ పోరు ముందుకు సాగుతున్న కొద్దీ అక్రమాల సంఖ్య కూడా పెరుగుతుండటంపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్న నిమ్మగడ్డ అక్రమాలపై వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై వారిని నిలదీస్తున్నారు. దీంతో అధికారుల్లోనూ భయం మొదలైంది. పంచాయతీ పోరులో రోజురోజుకూ ఫిర్యాదుల పరంపర పెరుగుతుండటంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా అధికారులపై విరుచుకుపడుతున్నారు. అక్రమాలను అడ్డుకోవడంలో కలెక్టర్లు, ఎస్పీలు విఫలమైతే వారిని విధుల నుంచి తప్పించడం ఖాయమని హెచ్చరికలు పంపుతున్నారు. అదే సమయంలో ఎన్నికల రద్దుకూ వెనుకాడబోనని హెచ్చరిస్తున్నారు.

    Also Read: ఇక ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ , రోడ్డు ట్యాక్స్ కట్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

    ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషనరే సుప్రీం అంటూ గతంలో పలుమార్లు కోర్టులు తేల్చిచెప్పాయి. అంతేకాదు రాజ్యాంగ పదవిలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డకు తన విచక్షణ మేరకు విశేషాధికారాలు ప్రయోగించే హక్కు కూడా ఉంది. దీన్ని ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ కోర్టులు కానీ అడ్డుకునే అవకాశం లేదు. ఇప్పటికే హైకోర్టు నిమ్మగడ్డకు ప్రభుత్వం సహకరించకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అక్రమాలను అడ్డుకోలేకపోతే విశేషాధికారాన్ని ప్రయోగించి ఎన్నికనే రద్దు చేస్తానంటూ నిమ్మగడ్డ నిన్న చేసిన హెచ్చరికలు అధికార పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్