Post Office Scheme: ప్రస్తుతం పోస్టల్ శాఖలో వేర్వేరు స్కీమ్స్ అమలవుతున్న సంగతి తెలిసిందే. పోస్టల్ శాఖలో సేవింగ్స్ అకౌంట్ ను కలిగి ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో పొదుపు ఖాతాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ను కలిగి ఉండటం ద్వారా వేర్వేరు పొదుపు పథకాలకు అర్హత పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడిదారులు ప్రభుత్వ భద్రత ప్రయోజనాలతో పాటు మంచి రాబడుల ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
Also Read: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండానే?
పోస్టాఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లకు డిపాజిట్ కు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు. కనీసం 50 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా పోస్టాఫీస్ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్ లో ఒక వ్యక్తి ఒకే ఖాతాను కలిగి ఉంటారు. మైనర్ తరపున ఖాతా ఓపెన్ చేయాలంటే తల్లిదండ్రులు ఓపెన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఖాతా ద్వారా జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ లో సేవింగ్స్ అకౌంట్ ను కలిగి ఉండటం ద్వారా 4 శాతం వడ్డీ ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ల ప్రకారం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై 10,000 రూపాయల వరకు వడ్డీ బెనిఫిట్స్ ను పొందవచ్చు. 500 రూపాయల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే మాత్రం ఎలాంటి వడ్డీ చెల్లించబడదు.
ఈ విషయాలను గుర్తుంచుకుని పోస్టాఫీస్ ఖాతాను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఇతర స్కీమ్స్ తో పోలిస్తే పోస్టాఫీస్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎన్నో రెట్ల లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలులో ఉన్నాయి.
Also Read: సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీలు.. అర్హతలు, పూర్తి వివరాలు ఇవే!