Bank Locker : గుర్తుంచుకోండి.. బ్యాంక్ లాకర్ రూల్స్ మారాయి.. టాప్ బ్యాంక్‌లలో ఎంత డబ్బు చెల్లించాలో తెలుసా ?

అలాగే బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయడానికి కొంత డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు లాకర్లు అందరికీ బ్యాంకులు అందించవు.

Written By: Rocky, Updated On : November 5, 2024 10:42 am

Bank Locker

Follow us on

Bank Locker : ప్రస్తుతం ప్రజలకు బ్యాంకులపై బాగా నమ్మకం పెరిగింది. సాధారణంగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉంచితే ఇబ్బంది ఉండదని అనుకుంటారు. అయితే విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు భద్రపరచుకునేందుకు కూడా ప్రజలు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి దొంగను దేవుడు కూడా పట్టుకోలేడు అన్న సామెతతో ఇంట్లోని విలువైన వస్తువులు భద్రపరచాలనే ఉద్దేశంతో బంగారం, ఆస్తుల పత్రాలను బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు లాకర్‌ను నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తప్పని సరిగా తీసుకోవాలి. అలాగే బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయడానికి కొంత డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు లాకర్లు అందరికీ బ్యాంకులు అందించవు. బ్యాంకుల్లో లాకర్లను పొందేందుకు, ఖాతాదారులు కొన్ని నియమాలను పాటించాలి. నగలు, ముఖ్యమైన పత్రాలు, ఇతర విలువైన వస్తువులను నిల్వ చేయడానికి బ్యాంక్ లాకర్ ఒక సురక్షితమైన ప్రదేశం. చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు లాకర్లను అందజేస్తాయి. అయితే, వాటి లభ్యత మారుతూ ఉంటుంది.

ఇటీవల బ్యాంక్ లాకర్‌కు సంబంధించిన సౌకర్యాల అద్దె, భద్రత, నామినేషన్‌కు సంబంధించిన కొన్ని నియమాలు మార్చబడ్డాయి. దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులైన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీల్లో ఈ నిబంధనను అమలు చేయనున్నారు. ఈ అన్ని బ్యాంకుల మధ్య ఛార్జీల వివరాలను, ఇప్పుడు ఎంత ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం. వ్యక్తిగత కస్టమర్‌లు, భాగస్వామ్య సంస్థలు, పరిమిత కంపెనీలు, క్లబ్‌లు మొదలైన వివిధ వర్గాల కస్టమర్‌లకు బ్యాంక్ లాకర్ సౌకర్యాలను బ్యాంకులు అందిస్తాయి. అయితే మైనర్‌ల పేరుతో బ్యాంకులు లాకర్లను కేటాయించడం లేదు. వార్షిక అద్దె ప్రాతిపదికన లాకర్ సేవలను అందిస్తూ, బ్యాంకులు తమ కస్టమర్లకు ఒక రకమైన లీజుదారుగా వ్యవహరిస్తాయి. భద్రత పరంగా, బ్యాంకులు ఖాతాదారుల విలువైన వస్తువులను వారి రుసుము కంటే చాలా సురక్షితమైనవని హామీ ఇస్తున్నాయి. బ్యాంకులో నగదును ఉంచినప్పుడు దాని భద్రతకు వారు బాధ్యత వహించరు. అందువల్ల, అదే నిల్వ చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

లొకేషన్‌ను బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి
SBI, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, PNB లాకర్ అద్దె బ్యాంకు శాఖ, స్థానం, లాకర్ పరిమాణంపై ఆధారపడి మారుతుది. దాని వివరాలను అర్థం చేసుకుందాం. బ్యాంక్ కొత్త రేటును విడుదల చేసింది.

ఎస్ బీఐ లాకర్ అద్దె
చిన్న లాకర్: రూ. 2,000 (మెట్రో/అర్బన్), రూ. 1,500 (సెమీ-అర్బన్/రూరల్)
మీడియం లాకర్: రూ. 4,000 (మెట్రో/అర్బన్), రూ. 3,000 (సెమీ-అర్బన్/రూరల్)
పెద్ద లాకర్: రూ. 8,000 (మెట్రో/అర్బన్) , రూ. 6,000 (సెమీ-అర్బన్/రూరల్)
అదనపు పెద్ద లాకర్: రూ. 12,000 (మెట్రో/అర్బన్), రూ. 9,000 (సెమీ-అర్బన్/రూరల్)

ICICI బ్యాంక్ లాకర్ అద్దె
గ్రామీణ ప్రాంతాలు: రూ.1,200 నుండి రూ.10,000
సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ. 2,000 నుండి రూ. 15,000
పట్టణ ప్రాంతాలు: రూ. 3,000 నుండి రూ. 16,000
మెట్రో: రూ.3,500 నుంచి రూ.20,000
మెట్రో+ స్థానం: రూ. 4,000 నుండి రూ. 22,000

hdfc బ్యాంక్ లాకర్ ఛార్జీలు
మెట్రో శాఖలు: రూ.1,350 నుంచి రూ.20,000
పట్టణ ప్రాంతాలు: రూ. 1,100 నుండి రూ. 15,000
సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ.1,100 నుండి రూ.11,000
గ్రామీణ ప్రాంతాలు: రూ.550 నుండి రూ.9,000

pnb లాకర్ ఛార్జీలు
గ్రామీణ ప్రాంతాలు: రూ.1,250 నుండి రూ.10,000
పట్టణ ప్రాంతాలు: రూ. 2,000 నుండి రూ. 10,000

కస్టమర్‌లకు 12 ఉచిత సందర్శనల సౌకర్యాన్ని బ్యాంక్ అందిస్తుంది. ఆ తర్వాత ప్రతి అదనపు సందర్శనకు రూ. 100 రుసుము వసూలు చేస్తుంటాయి బ్యాంకులు.