Virat Kohli Birthday: సమకాలీన క్రికెట్లో సచిన్ తర్వాత ఆ స్థాయిలో రికార్డులు సొంతం చేసుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరుగాంచాడు. కొంతకాలంగా సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు గాని.. గతంలో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా ఓటమి అంచున ఉన్న మ్యాచ్ లను వంటి చేత్తో గెలిపించాడు. అందుకే అతడికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అతడు అంటే పడి చచ్చే అభిమాన గణం ఉంది. విరాట్ కోహ్లీ ఢిల్లీలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో జన్మించాడు. చిన్నప్పటినుంచి అతడికి పట్టుదల ఎక్కువ. క్రికెట్ అంటే మక్కువ. అందుకే ఆ ఆటలో సత్తా చూపించాడు. తనదైన స్టైల్ కొనసాగించాడు. ఫలితంగా తిరుగులేని క్రికెటర్ గా ఆవిర్భవించాడు. 2008లో కౌలాలంపూర్ లో జరిగిన అండర్ -19 వరల్డ్ కప్ ను భారత్ గెలిచింది. యువ భారత్ జట్టుకు కోహ్లీ సారధ్యం వహించాడు. ఆ తర్వాత కొంతకాలానికే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఇక ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు ప్రారంభం నుంచి ఆడుతున్నాడు. కెప్టెన్ గా సేవలందించాడు.. 2008 ఆగస్టు 18న దంబుల్లా లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత అతడు టి20లోకి ప్రవేశించాడు. 2011లో జూన్ నెలలో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు.. 2011లో టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆ జట్టులో విరాట్ సభ్యుడు. 2013లో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 2024 లో టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. ఈ రెండు విజయాలలోనూ విరాట్ ది ముఖ్యపాత్ర. టెస్ట్ క్రికెట్లోనూ టీమిండియాను విరాట్ అగ్రస్థానంలో నిలిపాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలో విరాట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా విరాట్ ఆవిర్భవించాడు. గత దశాబ్ద కాలంలో 20వేల పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఐసీసీ అవార్డులలోనూ..
2020లో ఐసీసీ ప్రకటించిన క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ పురస్కారాన్ని కోహ్లీ దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఆటగాడికి సాధ్యం కానిస్తాయిలో ఐసీసీ పురస్కారాలను సొంతం చేసుకున్నాడు. 2012, 2017, 2018, 2023 సంవత్సరాలలో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా విరాట్ ఆవిర్భవించాడు. 2017, 2018 సంవత్సరాలలో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా విరాట్ నిలిచాడు. సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ పురస్కారం కూడా అందుకున్నాడు. 2018లో ఐసీసీ వన్డే, టెస్ట్ ప్లేయర్ పురస్కారాలు కూడా అందుకున్నాడు. ఒక సంవత్సరంలోనే అరుదైన అవార్డులను అందుకున్న తొలి క్రికెటర్ గా రికార్డు సొంతం చేసుకున్నాడు.