Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు చివరి దశకు చేరుకుందని సమాచారం. ఇటీవల స్పెయిన్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చింది మూవీ యూనిట్. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా చివరి షెడ్యూల్ను తాజాగా హైదరాబాద్లో ప్రారంభించారని తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలతో పాటు… ఓ పాటను షూట్ చేయనున్నారట. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే ఆలోచనలు ఉన్నారట డైరెక్టర్ పరశురామ్. కాగా ఇటీవలే ఈ సినిమాను ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రా బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు స్టైలీష్ లుక్లో కనిపిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించగా పలు కారణాల వల్ల ఏప్రిల్ కు మార్చారు.