కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ ఒక కొత్త కాంటెస్ట్ ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనడం ద్వారా భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీని పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ కాంటెస్ట్ లో పాల్గొంటారో వాళ్లు ఏకంగా 25 లక్షల రూపాయలు పొందవచ్చు. అమృతో మహోత్సవ్ పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
ఎవరైతే ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో విన్ అవుతారో వాళ్లు 25 లక్షల రూపాయలు బహుమతిగా పొందే అవకాశం ఉంటుంది. అయితే తొలి విజేత మాత్రమే ఈ ఫ్రైజ్ మనీని పొందే అవకాశాలు అయితే ఉంటాయి. రెండో విజేత 15 లక్షల రూపాయలు, మూడో విజేత 10 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనే వాళ్లు యాప్స్ ను రూపొందించాల్సి ఉంటుంది. న్యూస్, గేమ్స్, ఫిన్‌టెక్, నావిగేషన్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, అగ్రికల్చర్, సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ ను రూపొందించవచ్చు.
మొత్తం 16 కేటగిరీలు ఉండగా ఈ కేటగిరీలలో ఉత్తమ ప్రమాణాలతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాప్స్ ను రూపొందిస్తే మంచిది. సెప్టెంబర్ 30వ తేదీ ఈ కాంటెస్ట్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ కాంటెస్ట్ కు సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్‌లో మొత్తం రెండు స్టేజ్ లు ఉండగా అర్హత కలిగిన ఎంట్రీస్‌కు మాత్రమే మొదట స్క్రీనింగ్ ఉంటుంది.
రెండో దశలో జ్యూరీ ఎంపిక, డెమో ఉంటుంది. మన దేశానికి చెందిన వాళ్లు మాత్రమే ఈ పోటీకి అర్హులు. అమృత్ మహోత్సవ్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ కాంటెస్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.