Ceiling Fans : ఏసీలు, కూలర్లు లేని ఇల్లు ఉన్నా కూడా సీలింగ్ ఫ్యాన్ లేని ఇల్లు మాత్రం ఒకటి కూడా ఉండదు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీని బట్టి అనేక రకాల ఫీచర్లతో సీలింగ్ ఫ్యాన్లు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. మంచి నాణ్యత, రిమోట్ ద్వారా ఆపరేటింగ్ మరియు గది నలుమూలలకు గాలి వీయడం, తక్కువ విద్యుత్ వినియోగం వంటి తదితర ప్రత్యేకతలతో సీలింగ్ ఫ్యాన్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. సామాన్యులకు కూడా వీటి ధరలు అందుబాటులో ఉండేలాగా అలాగే అత్యుత్తమ ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రముఖ ఆన్లైన్ అమెజాన్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ సీలింగ్ ఫ్యాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అద్భుతమైన డిజైన్ ఉన్న ఫ్యాన్ కావాలని కోరుకునే వారికి కలర్ బాట్ స్టెల్లా క్యాడ్ చాలా బాగుంటుంది అని తెలుస్తుంది. ఈ సీలింగ్ ఫ్యాన్ ఇంట్లో మంచి లుక్ ఇస్తుంది. ఇది గరిష్టంగా 30 వాట్ల విద్యుత్ను వినియోగిస్తుంది. ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫ్యాన్ తో 67% వరకు విద్యుత్ ఆదా అవుతుందని సమాచారం. ఈ సీలింగ్ ఫ్యాన్ లో నిశ్శబ్దంగా తిరగడం అలాగే ఫ్యాన్ లో అమర్చబడిన ఎల్ఈడి లైట్లు మరియు ఫ్యాన్ బ్లేడ్ల దిశను మార్చే రివర్స్ మోడ్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అమెజాన్లో దీని ధర రూ.3899 గా ఉంది. అలాగే అమెజాన్లో లభ్యమవుతున్న మరొక ఫ్యాన్ క్రాంప్టన్ ఎనర్జీ అండ్ హైపర్ జెట్ సీలింగ్ ఫ్యాన్.
Also Read : వాట్సప్ లో ఈ సెట్టింగ్ ఆన్ చేసి సైబర్ నేరాల నుంచి దూరం అవండి..
దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మిగిలిన ఫ్యాన్ల కంటే 50 శాతం వరకు తక్కువ విద్యుత్ను ఉపయోగిస్తుంది. ఈ ఫ్యాన్ కు బి ఈ ద్వారా 5 ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది. ఈ సీలింగ్ ఫ్యాన్ 340 ఆర్పియం మోటారు వేగంతో గది అంతట కూడా గాలి వీచే లాగా చేస్తుంది. అలాగే ఈ సీలింగ్ ఫ్యాన్ రిమోట్ ను కూడా కలిగి ఉంది. రిమోట్ ని ఉపయోగించి మీరు హైపర్ మోడ్, టైమర్ మరియు స్లీప్ మోడ్లను సెట్ చేయవచ్చు. అమెజాన్ లో దీని ధర రూ.2499 గా ఉంది. ప్రస్తుతం తక్కువ విద్యుత్న ఉపయోగించే ఫ్యాన్లలో హావెల్స్ 1200 ఎం ఏ మోజల్ ఈసీ ఫ్యాన్ కూడా ఒకటి.
తెల్లటి రంగులో ఉండే ఫ్యాన్ మీ గదికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 390 ఆర్పిఎం వేగంతో గాలి వీస్తుంది. అలాగే ఈ ఫ్యాన్ లో ప్రత్యేకంగా వేగాన్ని సర్దుబాటు చేయడానికి ఐదు స్పీడ్ ఎంపికలు కూడా ఉన్నాయి. అమెజాన్లో దీని ధర రూ.1999 గా ఉంది. ఓరియంట్ ఫ్యాన్ మంచి పనితీరును కలిగి ఉంది. రిమోట్ సహాయంతో వేగాన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. స్విచ్ ఆఫ్ మరియు స్విచ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అమెజాన్ లో దీని ధర రూ.2999 గా ఉంది.
Also Read : ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా.. అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి…