Maruti Suzuki :నష్టాల్లో మారుతి సుజుకి.. కస్టమర్ల కోసం కార్లు వెయిటింగ్

మారుతి సుజుకి అనుకున్న దాని కంటే తక్కువగానే ఈ ఏడాది మొదట్లో అమ్మకాలు పడిపోయాయి. కానీ వాహనాల తయారీ మాత్రం తగ్గించలేదు. దీంతో కార్లు డీలర్‌షిప్స్ వద్దన నిలిచిపోయాయి. అయితే ఈ ఏడాది పూర్తయ్యే సరికి కార్ల అమ్మకాలు ఇంకా తగ్గే అవకాశం ఉందని రిపోర్ట్‌లు చెబుుతున్నాయి. దీంతో ముందుచూపుతో కంపెనీ కార్ల ఉత్పత్తిని తగ్గించింది.

Written By: Kusuma Aggunna, Updated On : August 25, 2024 8:09 pm

Maruthi Suzuki

Follow us on

Maruti Suzuki : ప్రముఖ కంపెనీ మారుతి సుజుకి దేశంలోని పెద్ద కార్ల తయారీ కంపెనీ. మారుతి సుజుకి కార్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు మైలేజ్ వస్తాయని చాలామంది ఈ కంపెనీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ కంపెనీ ప్రస్తుతం నష్టాల్లో ఉందని రిపోర్లులు తెలుపుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఈ కంపెనీ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. షోరూమ్‌లో లక్షలాది కార్లు ఉన్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో చూస్తే యువత ఎక్కువగా కొత్త మోడల్, ట్రెండింగ్ కార్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. టాప్‌లో ఉన్న మారుతి సుజుకి కార్లు ఒక్కసారిగా సేల్స్ కాకపోవడానికి అసలు కారణమేంటి? గతంలో అమ్మకాలు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎందుకు తగ్గాయో చూద్దాం.

మారుతి సుజుకి అనుకున్న దాని కంటే తక్కువగానే ఈ ఏడాది మొదట్లో అమ్మకాలు పడిపోయాయి. కానీ వాహనాల తయారీ మాత్రం తగ్గించలేదు. దీంతో కార్లు డీలర్‌షిప్స్ వద్దన నిలిచిపోయాయి. అయితే ఈ ఏడాది పూర్తయ్యే సరికి కార్ల అమ్మకాలు ఇంకా తగ్గే అవకాశం ఉందని రిపోర్ట్‌లు చెబుుతున్నాయి. దీంతో ముందుచూపుతో కంపెనీ కార్ల ఉత్పత్తిని తగ్గించింది. అయితే కేవలం మారుతి సుజుకికి మాత్రమే నష్టాలు కాదు.. మరికొన్ని కంపెనీల కార్లు కూడా నష్టాల్లో ఉన్నాయని.. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

కంపెనీ సేల్స్ బీభత్సంగా తగ్గాయని.. దీంతో వాహన నిల్వలు భారీగా పెరిగాయి. డీలర్‌షిప్స్ దగ్గర మొత్తం 7,30,000 కార్లు కొనుగోలు కానివి ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ మొత్తం రెండు నెలల్లో అమ్ముడుపోయే యూనిట్ల సంఖ్యతో సమానంగా ఉన్నాయని చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య సుమారు 4,00,000 యూనిట్లుగా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అంచనా వేసింది. ఇంత అధికంగా వాహనాలు నిలిచిపోవడంతో కంపెనీ ఆందోళన చెందుతుంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో కొత్త వాహనాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. యువత కొత్తగా మంచి మైలేజ్ ఇచ్చేవి కావడంతో పాటు ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఈక్రమంలో కొత్త వాహనాలపై మొగ్గు చూపుతున్నాయి.

పండుగల సీజన్‌లో కూడా వాహనాల అమ్మకం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా దసారాకి వీటి డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే మారుతి సుజుకి డిమాండ్ మార్కెట్లో తగ్గుతుంది ఏమోనని కంపెనీ పరిశీలిస్తుంది. అయితే మారుతి సుజుకి ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 4,96,000 యూనిట్లు మాత్రమే ఉంది. కానీ అమ్మకాలు 1.2 శాతం పెరిగాయి. మొత్తం 4.27 లక్షల యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ప్రపంచంలో మారుతి సుజుకి మొదటి స్థానంలో ఉంది. ఇంత డిమాండ్ ఉన్న మారుతి కంపెనీ ఇలా జరగడం అందరూ షాక్ అవుతున్నారు. మరి ఏడాది చివర్లో అయిన మారుతి సుజుకి కార్ల అమ్మకాలు పెరుగుతాయో లేదో చూద్దాం.