Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ 8′ నుండి చివరి నిమిషంలో తప్పుకున్న తేజస్విని గౌడా.. ఇంటర్వ్యూలో ఇంత గొడవ జరిగిందా!

బిగ్ బాస్ టీం ఒప్పందం కుదిరించుకున్న కంటెస్టెంట్స్ మొట్టమొదటగా మన అందరికీ వినిపించిన పేరు తేజస్విని గౌడా. సీరియల్స్ లో స్టార్ నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న ఈమె, సోషల్ మీడియా లో బాగా పాపులర్. అంతే కాదు, బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ కి ఆమె భార్య అవుతుంది. ఈ జంటకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

Written By: Vicky, Updated On : August 25, 2024 7:47 pm

Tejashwini Gouda Quit from Bigg Boss

Follow us on

Bigg Boss Telugu 8 : మరో వారం రోజుల్లో సరిగ్గా ఇదే రోజు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మా ఛానల్ లో గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతుంది. ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదల అయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి రకరకాల పేర్లు వినిపించాయి. అందులో కొంతమంది పేర్లు ఖరారు అయ్యాయని, అగ్రీమెంట్స్ కూడా జరిగిపోయాయని చెప్పుకొచ్చారు. అలా బిగ్ బాస్ టీం ఒప్పందం కుదిరించుకున్న కంటెస్టెంట్స్ మొట్టమొదటగా మన అందరికీ వినిపించిన పేరు తేజస్విని గౌడా. సీరియల్స్ లో స్టార్ నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న ఈమె, సోషల్ మీడియా లో బాగా పాపులర్. అంతే కాదు, బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ కి ఆమె భార్య అవుతుంది. ఈ జంటకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

ఈ సీజన్ లో ఈమె అడుగుపెట్టబోతుంది అనే టాక్ రాగానే, బిగ్ బాస్ నుండి టైటిల్ గెలవబోతున్న మొట్టమొదటి మహిళా కంటెస్టెంట్ అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే ఈమె ఈ షో నుండి ఇప్పుడు తప్పుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ టీం ఈమెని సంప్రదించిన కొత్తల్లోనే నాకు ఆసక్తి లేదని చెప్పిందట. కానీ బిగ్ బాస్ యాజమాన్యం ఈమె ఉంటే షో కి క్రేజ్ వస్తుందని, టీఆర్ఫీ రేటింగ్స్ బాగా పెరుగుతుందని, సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తాయని భావించి ఆమెకి భారీ రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేశారట. కానీ ఆమె మరింత డిమాండ్ చేసింది. ఈ రెమ్యూనరేషన్ పట్ల బిగ్ బాస్ టీం కి, తేజస్విని కి మధ్య చాలా రోజులు చర్చలు నడిచాయట.

అమర్ దీప్ సీజన్ 7 కి తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే మూడింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ ని తేజస్విని గౌడా డిమాండ్ చేసింది, అప్పుడే ఈ షోలో పాల్గొంటానని, లేకపోతే ఆ షోలో పాల్గొని నెగటివిటీని కొని తెచ్చుకోవాలనుకోవడం లేదని తేల్చి చెప్పిందట తేజస్విని. దీనిపై సుదీర్ఘంగా టీం లో ఉన్న సభ్యులతో చర్చించిన బిగ్ బాస్ టీం, ఆమెకి బదులుగా మరో టాప్ సెలబ్రిటీ ని ఎంచుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. అంటే కాకుండా తేజస్విని కి తమిళంలో ఒక సీరియల్ ఆఫర్ కూడా వచ్చిందని, అందుకే ఈ షో నుండి తప్పుకున్నట్టుగా మరో వార్త వినిపిస్తుంది. వీటిల్లో ఏది నిజం, ఏది రూమర్ అనేది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ షో లో ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ ఇంద్రనీల్ కూడా పాల్గొనబోతున్నట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సతీమణికి ఇంద్రనీల్ బిగ్ బాస్ కి వెళ్లడం ఇష్టం లేదు, కానీ ఇంద్రనీల్ కి మాత్రం ఆసక్తి ఉంది, ఈయన కూడా ఇంకా ఒప్పందం మీద సంతకం చెయ్యలేదు.