PAK vs BAN: ఓరయ్యా నువ్వేం నాయకుడివి.. స్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు గా..పాక్ కెప్టెన్ పై నెట్టింట తీవ్ర విమర్శలు..

స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టుతో రావిల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో పాకిస్తాన్ ఓడిపోయింది. 10 వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యింది. ఈ ఓటమి నేపథ్యంలో నెట్టింట పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : August 25, 2024 8:22 pm

PAK captain Shan Masood

Follow us on

PAK vs BAN:  పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయం సాధించింది. పాకిస్తాన్ జట్టుపై తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది.. మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 565 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ను పాకిస్థాన్ 448/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇదే ఆ జట్టుకు శాపంగా పరిణమించింది. మహమ్మద్ రిజ్వాన్ 171* ద్వి శతకానికి దగ్గరగా ఉన్నప్పుడు.. పాక్ కెప్టెన్ షాన్ మసూద్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ తరుణంలో పాకిస్తాన్ పాకిస్తాన్ బౌలింగ్ ను సమర్థవంతంగా కాచుకుంటూ బంగ్లా బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఏకంగా 565 పరుగులు చేశారు. ఫలితంగా పాకిస్తాన్ కెప్టెన్ పై విమర్శలు మొదలయ్యాయి. నెట్టింట అతడిని ఉద్దేశిస్తూ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ” నువ్వేం నాయకుడివి..స్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు గా.. అసలు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అలా ఎలా డిక్లేర్ చేస్తావు? మహమ్మద్ రిజ్వాన్ డబుల్ సెంచరీ చేసేవాడు కదా.. కొంచమైనా నీకు బుద్ధి లేదా” అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

10 వికెట్ల తేడాతో ఓడించింది..

ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పది వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. పాకిస్తాన్ జట్టును సొంత గడ్డపై పది వికెట్ల తేడాతో ఓడించిన జట్టుగా బంగ్లాదేశ్ ఘనత సొంతం చేసుకుంది.. వాస్తవానికి ఓవర్ నైట్ స్కోర్ 23/1 తో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 55.5 ఓవర్లలో 146 పరుగులకే చాప చుట్టేసింది. పాకిస్తాన్ విధించిన 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా చేదించింది.. జకీర్ హసన్ 19*, ఇస్లాం 9* రన్స్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 448/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 565 రన్స్ చేసింది.

చేతులెత్తేశారు

రెండవ ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 37, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ 51 మాత్రమే పరవాలేదు అనిపించారు. బాబర్ అజాం 22, షాన్ మసూద్ 14 పరుగులు మాత్రమే చేశారు. అయూబ్ 1, షౌద్ షకీల్ 0, ఆఘా సల్మాన్ 0 పూర్తిగా నిరాశపరిచారు. బంగ్లా బోర్డర్లలో మెహదీ హాసన్ మిరాజ్ 4/21, షకీబ్ అల్ హసన్ 3/44 అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ జట్టును కోల్పోకుండా చేశారు. పోరి ఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నిహీద్ రాణా తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో భారీగా పరుగులు చేయడంలో ముష్ఫికర్ రహీం 191, షాద్మాన్ ఇస్లాం 93, మోమినుల్ హక్ 50, లిటన్ దాస్ 56, మెహది హసన్ 77 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. అంతకుముందు పాకిస్తాన్ ఆటగాళ్లు షౌద్ షకీల్ 141, మహమ్మద్ రిజ్వాన్ 171 పరుగులు చేశారు. ఈ గెలుపు ద్వారా రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0 లీడ్ సాధించింది. ఆగస్టు 30 నుంచి రావల్పిండి వేదికగా రెండో టెస్ట్ జరుగుతుంది.