Car Subscription: మనకి నచ్చిన కారులో తిరగాలని చాలా మందికి ఉంటుంది. కానీ కారు కొనలేక చాలా మంది ఆశలను చంపుకుంటారు. కొన్ని కార్లను చూస్తే ఆహా అనేలా ఉంటాయి. వీటిని ఒక్కసారైనా డ్రైవ్ చేయాలని, వీటిలో ఎక్కడికైనా ప్రయాణించాలని చాలా మంది అనుకుంటారు. ఎంత ధనవంతులు అయిన కూడా మార్కెట్‌లోకి వచ్చిన ప్రతీ మోడల్ కార్లను కొనుగోలు చేయలేరు. ఇలా కొన్ని తర్వాత వాటిని పక్కన పడేయడం వల్ల డబ్బులు కూడా వృథా అవుతాయి. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు నచ్చిన కారులో తిరగడానికి ఆటో మొబైల్ కంపెనీలు అన్ని కూడా మంచి ప్లాన్‌ను తీసుకొచ్చాయి. కస్టమర్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ప్లాన్‌లో చేరితే నచ్చిన కారులో ఎప్పుడైనా తిరగవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ కారు ప్రియులకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కార్ లవర్స్ మార్కెట్‌లోకి వచ్చిన ప్రతీ కారును డ్రైవ్ చేయాలని అనుకుంటారు. ప్రతీ సారి కొనడం కంటే ఇలా చేయడం బెటర్. ఇంతకీ ఆ సబ్‌స్క్రిప్షన్ ఏంటి? దీనివల్ల లాభాలు ఏంటి? అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కడ తీసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎంత డిపాజిట్ చేయాలంటే?
ప్రముఖ ఆటోమొబైల్స్ అన్ని కూడా కారు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఇస్తోంది. అయితే మీరు తీసుకునే ప్లాన్ బట్టి డిపాజిట్ చేయాలి. కారు సబ్‌స్క్రిప్షన్ తీసుకునే ముందు కొంత డబ్బులు పే చేయాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన సమాయానికి నెల వారీగా డబ్బులు చెల్లించాలి.
లాభాలు ఏవైనా ఉన్నాయా?
సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే నచ్చిన కారును ఈజీగా తీసుకోవచ్చు. దీనివల్ల మీకు నచ్చిన కారును తీసుకోవచ్చు. వద్దనుకుంటే పాత కారును వదిలేసి కొత్త కారును తీసుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌లోనే మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ట్యాక్స్‌లు వంటివి అన్ని కూడా కవర్ అవుతాయి. దీనికి ఎలాంటి ఎక్స్‌ట్రా డబ్బులు కూడా కట్టాక్కర్లేదు.
తీసుకోవడం ఎలా?
కారు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్‌కి వెళ్లాలి. పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఇన్‌కం ఫ్రూఫ్ అన్ని కూడా ఇవ్వాలి. అదే మీరు బిజినెస్ ఓనర్ అయితే బ్యాంక్ స్టేట్‌మెంట్, ఐటీ రిటర్నులు కూడా చూపించాలి. కంపెనీ అయితే వాటి లాభాలు, నష్టాలు కూడా చూపించాలి. అయితే ఇండియాలో మారుతీ సుజుకి, మహీంద్రా, హ్యుందాయ్, ఎమ్జీ, నిస్సాన్, టయోటా కంపెనీలు కార్సబ్స్క్రిప్షన్ను అందిస్తున్నాయి.
ప్యాకేజీలో ఉండేవి..
ఈ కారు సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలో గవర్నమెంట్ పేమెంట్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, సర్వీస్ ప్యాకేజీలు, ముందస్తు లీజ్ అన్ని ఉంటాయి. మీరు నిర్దిష్ట పరిమితికి మించి ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే మాత్రం దానికి ఎక్కువగా డబ్బులు చెల్లించాలి. మీరు ప్రతీ నెలా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తారో ముందు వారికి చెబితే తక్కువ ధరకు కారు సబ్‌స్క్రిప్షన్ ఇస్తారు. ఎలక్ట్రిక్ కారు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే..తెల్లని బోర్డ్‌పై నల్ల అక్షరాలు లేదా పచ్చని బోర్డ్‌పై తెల్లని అక్షరాలు ఉండేలా కారు ప్లేట్‌ను సెట్ చేసి ఇస్తారు.