Iphone Offer: ఈ ఏడాది పూర్తి కావడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. దీంతో పలు ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది కొత్త వస్తువులను కొనాలని చూస్తుంటారు. అందులోనూ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ తీసుకోవాలని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది మార్కెట్‌లోకి వచ్చే కొత్త మొబైల్ ఫోన్లను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఇ కామర్స్ కూడా స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా ఆఫర్‌లను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది ఐఫోన్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఐఫోన్‌లో అయితే డేటా భద్రంగా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది. అలాగే ఫొటోలు కూడా చాలా బాగా వస్తాయి. చాలా మంది కేవలం ఫొటోల కోసమే ఐఫోన్‌ను తీసుకుంటారు. అయితే ఐఫోన్ కొనుగోలు చేయాలనే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏడాది పూర్తి కావడంతో ఐఫోన్ల ధరలపై ఇ కామర్స్ భారీగా డిస్కౌంట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ఐఫోన్ 14 అన్ని వేరియంట్‌లపై ఆఫర్లను విడుదల చేశాయి.
ఐఫోన్ 14లోని అన్ని వేరియంట్లలో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఐఫోన్ 14లో 128GB, 256GBతో పాటు 512GB స్టోరేజ్ వేరియంట్‌లు కూడా తక్కువ ధరకే ఈ ఆఫర్‌లో తీసుకోవచ్చు. అన్నింటి కంటే ఐఫోన్ 14లోని 256GB వేరియంట్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అయిన అమోజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం ఐఫోన్ 14 వేరియంట్ 256GB రూ.79,900 ఉంది. అదే మీరు ఈ ఆఫర్‌లో 19శాతం తగ్గించి తీసుకోవచ్చు. అంటే మీరు కేవలం రూ.64,900కే ఐఫోన్ 14ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ వల్ల మీకు దాదాపుగా రూ.15 వేలు ఆదా అవుతుంది. మీరు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు కేవలం రూ.2,924 మాత్రమే పే చేయాలి. మీరు ఎక్స్ఛేంజ్ పెడితే ఇంకా డబ్బుు తగ్గుతాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో దాదాపుగా రూ.27,350 వరకు ఆదా చేసుకోవచ్చు. అది కూడా మీ ఫోన్ వర్కింగ్ బట్టి ఉంటుంది.
ఐఫోన్ 14లో మంచి ఫీచర్లు ఉన్నాయి. అల్యూమినియం ఫ్రేమ్‌తో ఉన్న గ్లాస్ బ్యాక్ ప్యానెల్, 6.1 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లే ఉంది. అలాగే iOS 16 ఉంది. అవసరమైతే దీన్ని కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫొటోలు ఇందులో బాగా వస్తాయి. 12mp+12mp మెగా పిక్సెల్‌తో డ్యూయల్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరా సెన్సార్ 1.5, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ పవర్ 3279mAh.