Swapna Shastra : స్వప్న శాస్త్రం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మీ కలలో కనిపించే ప్రతి వస్తువుకు లేదా సన్నివేశానికి రానున్న రోజుల్లో జీవితంలో పలు మార్పులు రానున్నాయని సూచిస్తుంది. కలలో జరిగే కొన్ని విషయాలు మీరు ధనవంతులవుతారని సూచిస్తాయి. అలాగే మీ కలలో ఎప్పుడైనా మీరు ఏడుస్తున్నట్లు లేదా ఇతరులు ఏడుస్తున్నట్లు కనిపిస్తే దానివలన జీవితంలో పెను మార్పులు రానున్నాయని స్వప్న శాస్త్రం సూచిస్తుంది. నిద్రలో వచ్చే ప్రతి కల భవిష్యత్తులో జరగనున్న కొన్ని సంఘటనలను సూచిస్తుందని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ప్రతి కలకి కూడా వేరు వేరు అర్థాలు ఉంటాయని చెప్తుంటారు. కొన్ని కలలు చాలా కష్టాలను తెచ్చి పెడితే మరికొన్ని కళలు శుభాలను సూచిస్తాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కలలో జంతువులు పక్షులు మాత్రమే కాకుండా కొన్ని రకాల సంఘటనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కలలో ఎవరైనా తాము ఏడుస్తున్నట్లు కనిపించడం సాధారణ విషయం కాదు. ఈ కలకి స్వప్న శాస్త్రంలో చాలా ప్రత్యేక అర్థం ఉంది. మీరు కలలో ఏడుస్తున్నట్లు కనిపించిన లేదా ఎవరైనా ఏడుస్తున్నట్లు కనిపించిన దానికి స్వప్న శాస్త్రంలో ప్రత్యేక అర్థం ఉంది. కలలో ఏడ్చినట్లు కనిపించడం ఏదైనా మంచి జరగనుందా లేదా చెడు జరగనుందా అనే దానికి సంకేతంగా పరిగణించబడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తే మీ ఆయుష్షు నిండు నూరేళ్లు అని అర్థం. అలాగే మీ జీవితం సుదీర్ఘంగా ఉంటుందని రానున్న రోజుల్లో జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారని ఈ కల సూచిస్తుంది. ఈ కల ఆర్థిక లాభాలను కూడా సూచిస్తుంది.
మీరు కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే మీరు ఏదైనా అవార్డు అందుకునే అవకాశం ఉంది లేదా మీ ప్రణాళికలలో ఒకటి విజయవంతం అయ్యే అవకాశం ఉంది లేదా మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. కలలో మీరు చాలా బిగ్గరగా ఏడుస్తున్నట్లు కనిపిస్తే అది శుభసంకేతంగా పరిగణిస్తారు. భవిష్యత్తులో మీకు ఏదైనా మంచి జరుగుతుందని ఈ కల సూచిస్తుంది.
జీవితంలో ఏదైనా పెద్ద మార్పు జరగబోతుంది అని కూడా ఈ కల కు అర్థం. మీ కెరీర్లో లేదా వ్యాపారంలో పురోగతి పొందవచ్చు అని ఈ కల అర్థం. ఏదైనా ఒక పని కొన్ని ఆటంకాల వలన నిలిచిపోయినట్లయితే అది కూడా పూర్తవుతుంది. మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది.
అలాగే మీ కలలో ఎవరైనా ఇతర వ్యక్తి ఏడుస్తున్నట్లు కనిపిస్తే అది మీ జీవితంలో కొన్ని సమస్యలకు సంకేతం కావచ్చు. చేపట్టిన పనిలో ఏదైనా ఆటంకం జరగవచ్చు లేదా ఎవరితోనైనా మీ సంబంధం చెడిపోవచ్చు అని ఈ కల సూచిస్తుంది.
స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తే త్వరలో మీ కోరికలు నెరవేరబోతున్నాయని లేదా మీ కెరీర్ లో సానుకూల మార్పులు ఉండబోతున్నాయని అర్థం. ఒకవేళ మీరు పెళ్లి కాని వారు అయితే త్వరలో పెళ్లి కుదరవచ్చని అర్థం.