Water
Water: నీరే ప్రాణం అని ఎన్నో సార్లు వినే ఉంటారు. చదివే ఉంటారు కదా. అవును సరైన మార్గంలో సరిగ్గా నీరును తాగితే నిజంగా శరీరానికి ఇది ప్రాణమే. కానీ అతిగా తాగితే మాత్రం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటి ప్రాముఖ్యతను వివరించడానికి నీరే ప్రాణం అనే ఒక్క మాటలో మొత్తం అర్థం అవుతుంది. ఇది దాహాన్ని తీర్చడానికి మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అని వినే ఉంటారు. ఈ నీరు విషయంలో కూడా అదే నిజం అంటున్నారు నిపుణులు. మరి అధికంగా నీరు తీసుకుంటే ఏం జరుగుతుందో చూసేద్దాం..
Also Read: బట్టతల, జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఇవి రెగ్యులర్ గా తింటూ ఉండాలి.. అవేంటంటే?
తగినంత పరిమాణంలో తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ అధికంగా తాగితే మాత్రం అనేక తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడతాయి. ఎక్కువ నీరు తాగడం ప్రమాదకరం కావచ్చు. చాలా మంది, ముఖ్యంగా వేడి వాతావరణంలో వ్యాయామం చేసేవారు, తగినంత నీరు తాగడం లేదని ఆందోళన చెందుతారు. దీంతో ఎక్కువగా తాగేస్తుంటారు. కానీ ఇది విషపూరితం.
మీ శరీరంలో మూత్రపిండాలు విసర్జించగలిగే దానికంటే ఎక్కువ నీరు ఉంటే సమస్య వస్తుంది. ఎక్కువ నీరు తాగడాన్ని హైపోనాట్రేమియా లేదా నీటి మత్తు అని అంటారు. ఇది శరీరం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను భంగపరిచే ఒక పరిస్థితి. ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు తగ్గుతాయి. తద్వారా కణాలు ఉబ్బుతాయి.కొన్ని సార్లు మూర్ఛ, కోమా లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.
దీనితో పాటు, ఎక్కువ నీరు తాగడం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు, గందరగోళం వంటి సమస్యలు కూడా వస్తాయి. శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడే మూత్రపిండాలు, అదనపు నీరు తాగడం వల్ల ఓవర్‌లోడ్ అవుతాయి. తద్వారా దానిని తొలగించలేవు.
హైడ్రేటెడ్ గా ఉండటం ఎంత ముఖ్యమూ తక్కువ నీరు తాగడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ అవసరమైన దానికంటే ఎక్కువ నీరు త్రాగడం వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల కొన్ని అవాంతర లక్షణాలు కనిపిస్తాయి. తక్కువ నీళ్లు తాగడం ఎంత ప్రమాదకరమో, ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ముఖ్యంగా శరీరంలో ప్రధాన ఎలక్ట్రోలైట్ల లోపం ఉన్నప్పుడు.
ఎక్కువ నీరు తాగినప్పుడు, మూత్రం రంగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి, యూరోక్రోమ్ కారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అది లేత పసుపు రంగులో కనిపించకపోతే మీరు ఎక్కువ నీరు తాగుతున్నారని హెచ్చరిక సంకేతం. అలాగే, మీరు రోజుకు 6 నుంచి 8 సార్లు కంటే ఎక్కువ టాయిలెట్‌కి వెళితే, అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇది మీరు ఎక్కువ నీరు వినియోగిస్తున్నారని చూపిస్తుంది.
Also Read: పుచ్చకాయను ఫ్రిజ్లో ఉంచి తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలుసా?