https://oktelugu.com/

Car Loan: ‘కారు’ చౌకగా రుణాలు ఇచ్చే బ్యాంకులు ఇవే!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్‌పై 8.7 శాతం నుంచి 10.45 శాతం వరకు వడ్డీ తీసుకుంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కార్లోన్‌పై 8.75 శాతం నుంచి వడ్డీ రేటు స్టార్ట్ అవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే వడ్డీ రేటు 8.85 శాతం నుంచి మొదలవుతుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 17, 2024 / 06:24 PM IST

    Car Loan

    Follow us on

    Car Loan: మోటార్‌ సైకిళ్లు పెద్దగా తయారు కాని కాలంలో సైకిల్‌ నిత్యవసర వస్తువు.. తర్వాత మోటార్‌ సైకిళ‍్ల ఉత్పత్తి పెరగడం, వేగంగా పనిచేసుకునే వీలు ఉండడంతో మోటార్‌ సైకిళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కార్ల కాలం నడుస్తోంది. ఒకప్పుడు సంపన్న కుటుంబానికే పరిమితమైన కారు.. ఇప్పుడు మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర వాహనంగా మారింది. ఈ నేపథ్యంలో చాలా మంది కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా తర్వాత కార‍్ల కొనుగోళ్లు మరింత పెరిగాయి. రుణాలు ఇచ్చే బ్యాంకులు పెరగడం కూడా కార‍్ల కొనుగోళ్లు పెరగడానికి మరో కారణం. లోన్‌ తీసుకుని కారు కొనేవారికి అనేక ఫైనాన్స్‌ సం‍స్థలు, బ్యాంకులు రుణాలు విరివిగా ఇస్తున్నాయి. అయితే కారు కొనుగోలుకు ముందు తీసుకునే లోన్‌ ఏ బ్యాంకు ఎంత వడ్డీ వసూలు చేస్తుందో తెలుసుకోవాలి. దీంతో ఈఎంఐ కూడా తక్కువగా ఉంటుంది. ఏయే బ్యాంకులు ఎంత వడ్డీకి రుణాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం.

    రుణాలపై వడ్డీ రేట్లు ఇలా..
    యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్‌పై 8.7 శాతం నుంచి 10.45 శాతం వరకు వడ్డీ తీసుకుంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కార్లోన్‌పై 8.75 శాతం నుంచి వడ్డీ రేటు స్టార్ట్ అవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే వడ్డీ రేటు 8.85 శాతం నుంచి మొదలవుతుంది. కెనరా బ్యాంక్‌లో 8.7 శాతం నుంచి వడ్డీ ప్రారంభమవుతుంది. బ్యాంకు ఆఫ్ ఇండియాలో చూస్తే వడ్డీ రేటు 8.85 శాతం నుంచి స్టార్ట్‌ అవుతుంది. యూకో బ్యాంకు వడ్డీరేటు 8.45 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. సే‍్టట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8.75 శాతం నుంచి వడ్డీ ప్రారంభం అవుతుంది. సౌత్ ఇండియన్ బ్యాంకు కారు లోన్‌పై 8.75 శాతం నుంచే వడ్డీ రేటు వసూలు చేస్తుంది.

    హెచ్‌డీఎఫ్‌సీ ఇలా..
    ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి కారు లోన్‌ తీసుకోవాలంటే క్రెడిట్‌ స్కోర్‌ ఉండాలి. క్రెడిట్ స్కోర్ తక్కవగా ఉంటే లోన్ అమౌంట్ తగ్గుతుంది. క్రెడిట్ స్కోర్ 750కు పైన ఉంటే.. అప్పుడు లోన్స్ సులభంగా లభిస్తాయి. లోన్‌ అమౌంట్‌ కూడా ఎక్కువగా పొందవచ్చు. వడ్డీరేటు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏడాది వరకు టెన్యూర్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. గరిష్టంగా 8 ఏళ్లు లోన్ టెన్యూర్ పెట్టుకోవచ్చు.

    ఇవి ఉండాలి..
    ఇక కారు లోన్ పొందాలనుకునే వారికి ఐడీ ప్రూఫ్‌, అడ్రస్‌ ప్రూఫ్‌, ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్‌, బ్యాంక్ స్టేట్‌మెంట్, సిగ్నేచర్ వెరిఫికేషన్‌, వెహికల్‌ లోన్‌ అగ్రిమెంట్‌ డాక్యుమెంట్లు ఉండాలి. వయసు ధ్రువీకరణకు బర్త్ సర్టిఫికెట్ లేదా పదో తరగతి మార్క్స్ లిస్ట్, ఆధార్ కార్డు ఇవా‍్వల్సి ఉంటుంది. చిరునామా కోసం కూడా ఆధార్ ఇవ్వొచ్చు. ఓటర్ గుర్తింపు కార్డు లేదా రేషన్‌ కార్డు కూడా ఇవ్వొచ్చు. ఐడీ ప్రూఫ్ కోసం పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు కూడా ఇవ్వొచ్చు.