Devara: సైన్యంతో దండెత్తిన ఎన్టీఆర్… దేవర ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా?

ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని దేవర నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ దీనిపై అధికారిక ప్రకటన జరిగింది. ఫియర్ సాంగ్ పేరుతో ఫస్ట్ సింగిల్ మే 19న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Written By: S Reddy, Updated On : May 17, 2024 6:15 pm

Devara

Follow us on

Devara: ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది. దేవర రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ లుక్, ప్రోమోలు అంచనాలు పెంచేశాయి. దేవర చిత్రం నుండి తరచుగా అప్డేట్స్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వారి దాహం తీరేలా అదిరిపోయే అప్డేట్ సిద్ధమైంది.

ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని దేవర నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ దీనిపై అధికారిక ప్రకటన జరిగింది. ఫియర్ సాంగ్ పేరుతో ఫస్ట్ సింగిల్ మే 19న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా నేడు ఫియర్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. దేవర యూనిట్ ఇచ్చిన ఈ సడన్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ గూస్ బంప్స్ రేపింది. కేవలం శాంపిల్ ఇలా ఉంటే… పూర్తి సాంగ్ ఎలా వుంటుందో అనే ఆత్రుత పెంచేసింది.

ఇక ఎన్టీఆర్ లుక్ అనేది మరో హైలెట్. తన సైన్యంతో పడవల్లో యుద్దానికి దండెత్తుతున్నాడు. ఎన్టీఆర్ టైగర్ వలె ఫెరోషియస్ గా ఉన్నాడు. నేడు ప్రోమో చూశాక సాంగ్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య రెట్టింపు అవుతుంది అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న క్రమంలో ఓ పాత్ర నైజం తెలియజేసేలా ఫియర్ సాంగ్ డిజైన్ చేశారని సమాచారం.

దేవర మూవీలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమెకు ఇది ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. శ్రీదేవి వారసురాలైన జాన్వీ కపూర్… ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టడం మరొక వ్ విశేషం. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నాడు. అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో దేవర విడుదల కానుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాగా… ఆయన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లారు.