Prabhas : మారుతి అనవసరంగా ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడా..?

కాబట్టి ఇలా అనుకుంటున్నాడని సినిమా యూనిట్ నుంచి కూడా కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి...

Written By: NARESH, Updated On : May 17, 2024 7:36 pm

Is Maruti making a film with Prabhas unnecessarily?

Follow us on

Prabhas : ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ఎప్పుడైతే ఈయన బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి ఇండియాలోనే టాప్ హీరోలందరికీ పోటీ ఇస్తు తను నెంబర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అన్నీ కూడా ఆయనకు మంచి పేరుతో పాటు మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన నాగశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న కల్కి సినిమాను జూన్ 27వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎంతవరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే ఏమీ బయటకు రావడం లేదు. ఇక ఈ సినిమాని పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే ప్రయత్నంలో మారుతి ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ప్రభాస్ అనవసరంగా ఈ సబ్జెక్టుని ఒప్పుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టు లను లైన్ లో పెడుతూ ప్రయోగాత్మకమైన సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఎందుకు మారుతి లాంటి ఒక చిన్న డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మారుతి కూడా ప్రభాస్ తో అనవసరంగా సినిమాని చేస్తున్నానా అనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే మారుతి సంవత్సరంలో రెండు సినిమాలు రిలీజ్ చేసేవాడు. ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రభాస్ సినిమా పైనే కూర్చుంటున్నాడు.ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ రావడం లేదు. దానివల్ల ఆయన సినిమాల పరంగా అయిన, రెమ్యూనరేషన్ పరంగా అయిన చాలావరకు లాస్ అవుతున్నాడు. కాబట్టి ఇలా అనుకుంటున్నాడని సినిమా యూనిట్ నుంచి కూడా కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి…