Car Charging : ఇకపై రాత్రిపూట ఎలక్ట్రిక్ కార్ ఛార్జ్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పనిలా మారబోతుంది. దేశంలోని ఓ రాష్ట్రంలో రాత్రిపూట ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేస్తే, పగటిపూట కంటే 60 శాతం ఎక్కువ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దీని కోసం రెగ్యులేటర్ ‘టైమ్ ఆఫ్ డే’కి సంబంధించిన రూల్స్ మార్చింది.
సమయం ప్రకారం ఛార్జింగ్ ఖర్చులో ఈ పెద్ద మార్పు కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాబట్టి మీరు మీ ఇంధన ఖర్చు తగ్గుతుందని, దీర్ఘకాలంలో కారు నడపడానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుందని భావించి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసి ఉంటే ఈ నిర్ణయం అలాంటి వారిని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తుంది.
Also Read : మహీంద్రా మెగా సీక్రెట్ ప్లాన్.. ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని రకాల కార్లు!
కేరళ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్‌ను రెండు టైమ్ జోన్‌లుగా విభజించింది. ఇందులో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమయాన్ని ‘సోలార్ పీరియడ్’గా పేర్కొన్నారు. అయితే సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఉన్న సమయాన్ని ‘నాన్-సోలార్ పీరియడ్’గా పేర్కొన్నారు.
వివిధ మీడియా కథనాల ప్రకారం.. సోలార్ పీరియడ్‌లో ఎలక్ట్రిక్ కారును పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్‌లో ఛార్జ్ చేస్తే సాధారణ విద్యుత్ ధర కంటే 30 శాతం తక్కువ రేటు చెల్లించాలి. అదే సమయంలో నాన్-సోలార్ పీరియడ్‌లో సాధారణ విద్యుత్ ధర కంటే 30 శాతం ఎక్కువ రేటు చెల్లించాలి. అంటే ఈవీ ఛార్జింగ్ కోసం రూ.100 చెల్లిస్తే, సోలార్ పీరియడ్‌లో రూ.70 మాత్రమే చెల్లించాలి. అయితే నాన్-సోలార్ పీరియడ్‌లో అదే మొత్తం రూ.130 అవుతుంది. ఈ విధంగా రాత్రిపూట ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి 30 శాతం ఎక్కువ చెల్లించాలి. కానీ పగటిపూట కంటే రాత్రిపూట ఈవీ ఛార్జ్ చేయడానికి 85 శాతం అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల కార్యకలాపాల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని తర్వాత కేరళ విద్యుత్ నియంత్రణ సంస్థ దాని ధరలను, టైమ్ ఆఫ్ డేను మార్చింది. ప్రస్తుతం కేరళలో 3 టైమ్ జోన్‌లలో బిల్లింగ్ జరుగుతోంది. ఇందులో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు టైమ్ జోన్‌లు ఉన్నాయి. కొత్త మార్గదర్శకాల తర్వాత కేరళలో 2 టైమ్ జోన్‌లు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వం రాత్రిపూట ఈవీ ఛార్జింగ్‌ను నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తోంది.
Also Read : ఇది మామూలు ఆఫర్ కాదు.. ఏకంగా రూ.90లక్షల తక్కువకే రోల్స్ రాయిస్, జాగ్వార్