Canara Bank zero Balance Savings Account : ప్రభుత్వ పథకాలు అలాగే ఇతర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు ఖాతాను తెరుస్తున్నారు. అయితే కొన్ని బ్యాంకు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ కనీస బ్యాలెన్స్ పేదలకు అలాగే సామాన్య ప్రజలకు ఆర్థిక భారంగా మారింది. కొన్ని బ్యాంకులలో కనీస బ్యాలెన్స్ లేకపోతే చార్జీలు విధిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని బ్యాంకులు సామాన్య ప్రజలకు మినిమం బ్యాలెన్స్ నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. దేశంలో ప్రభుత్వా రంగా బ్యాంకులలో ఒకటి అయినా కెనరా బ్యాంకు జూన్ 1వ తేదీ నుంచి తమ బ్యాంకులో ఉన్న అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలపై నెలవారి కనీస బ్యాలెన్స్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే తక్కువ లేదా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను ప్రజలకు మరికొన్ని బ్యాంకులు కూడా అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాను ఎటువంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా ప్రజలకు అందిస్తుంది.
Also Read : వాట్సాప్‌లో న్యూ లాగౌట్ ఫీచర్.. ఎప్పటి నుంచి అందుబాటులోకి అంటే?
ఈ ఖాతాలను యాక్టివేట్ చేయడానికి అలాగే క్లోజ్ చేయడానికి ఎటువంటి చార్జీలు అవసరం ఉండదు. ఈ ఖాతాలపై మీరు రూ.10 కోట్లకు ఏడాదికి 2.70% వడ్డీ రేటును పొందవచ్చు. అయితే దీని కోసం మీరు భారతీయ నివాసితులై ఉండాలి. ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు కేవైసీ పూర్తి అయ్యి ఉండాలి. అయితే ఈ ఖాతాలలో గరిష్ట బ్యాలెన్స్ పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ఏటీఎం లేదా బ్రాంచ్ లో నుంచి మీరు నగదు విత్డ్రా చేసుకోవచ్చు. జూన్ 1వ తేదీ నుంచి అన్ని సేవింగ్స్ ఖాతాలలో కూడా కెనరా బ్యాంకు మినిమం బ్యాలెన్స్ జరిమానాలను తొలగించింది. ఈ పొదుపు ఖాతాలు అన్నిటిని కెనరా బ్యాంకు జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా మార్పు చేసింది. అన్ని పొదుపు ఖాతాలకు అలాగే శాలరీ ఖాతాలకు, ఎన్ఆర్ఐ ఖాతాలకు ఇవి వర్తిస్తాయి. ఇండియన్ బ్యాంకు కూడా తమ బ్యాంకులో ఉన్న మైనర్ ఖాతాలకు అలాగే ఖాతాలకు నిర్దిష్ట జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.
పొదుపు ఖాతాలలో గరిష్టంగా రెండు లక్షల వరకు ఉన్న ఖాతాలకు కనీస బ్యాలెన్స్ చార్జీలు ఉండవు. చెక్ బుక్ లేకుండా సాధారణంగా ఉన్న పొదుపు ఖాతాలకు కనీసం 500 నుంచి ₹1000 వరకు మినిమం బాలన్స్ ఉండాలి. ఒకవేళ మీరు ఈ ఖాతాలలో కనీస బ్యాలెన్స్ ఉంచకపోయిన కూడా ఇటువంటి జరిమానా చార్జీలు విధించరు. యాక్సిస్ బ్యాంకు లో ఉన్న కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా ప్రధానమంత్రి జన ధన్ యోజన కింద బేసిక్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తన కస్టమర్లకు ఎటువంటి కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాను అందిస్తున్నారు.